Spicejet: హైదరాబాద్‌- అయోధ్య విమానం నిలిపివేత

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

Updated : 13 Jun 2024 07:10 IST

దిల్లీ: హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను రెండు నెలల క్రితం కంపెనీ ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌జెట్‌ విమానాలు నడిపింది. అయితే తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని