Hyundai Aura: హ్యుందాయ్‌ ఆరా సరికొత్తగా.. @రూ.6.29 లక్షలు

Hyundai Aura: పలు మార్పులు చేసి హ్యుందాయ్‌ తమ కాంపాక్ట్‌ సెడార్‌ ఆరాను సరికొత్తగా తీసుకొచ్చింది. 

Updated : 23 Jan 2023 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ తమ కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ (Hyundai Aura)లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ. 6.29- 8.87 లక్షలు. ముందు భాగాన్ని రీడిజైన్‌ చేశారు. రేడియేటర్‌ గ్రిల్‌ను నలుపు రంగుతో తీసుకొచ్చారు. ముందు బంపర్‌పై ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ను అమర్చారు. వెనుక భాగంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.

కొత్త వెర్షన్‌ (Hyundai Aura)లో టర్బో- పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్ అందుబాటులో లేవు. అయితే, కొత్తగా 1.2 లీటర్‌ కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2 లీటర్‌ బైఫ్యుయల్‌ (సీఎన్‌జీ, పెట్రోల్‌) ఇంజిన్‌ ఆప్షన్లను అదనంగా తీసుకొచ్చింది. 1.2 లీటర్‌ కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌ 113.8ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 83 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. దీంట్లో 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్‌ వెర్షన్‌ కూడా ఉంది. అదే 1.2 లీటర్‌ బైఫ్యుయల్‌ 95.2ఎన్‌ఎం టార్క్‌ వద్ద 69పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ కొత్త ‘ఆరా’ (Hyundai Aura) కారు బుకింగ్‌లు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. రూ. 11,000 నామమాత్రపు రుసుము చెల్లించి బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌+, ఎస్‌ఎక్స్‌(ఓ) వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, బర్‌గ్లర్‌ అలారం, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

పాత వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఆరా (Hyundai Aura)లో ఫుట్‌వెల్‌ లైటింగ్‌; స్టీరింగ్‌ వీల్‌, గేర్‌ నాబ్‌పై తోలు తొడుగు; టైప్‌-సీ ఫాస్ట్‌ యూఎస్‌బీ ఛార్జర్‌; కొత్త ఎంఐడీతో కూడిన 3.5 అంగుళాల స్పీడోమీటర్‌, 8 అంగుళాల తెర, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో- కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, పుష్‌ బటన్‌, స్టార్ట్‌/స్టాప్‌, క్రూజ్‌ కంట్రోల్‌తో కూడిన స్మార్ట్‌ కీని కూడా అందిస్తున్నారు. పోలార్‌ వైట్‌, టైటన్‌ గ్రే, టైఫూన్‌ సిల్వర్‌, స్టార్రీ నైట్‌, టీల్‌ బ్లూ, ఫియరీ రెడ్‌ రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని