Automobile News: క్రెటాలో నైట్‌ ఎడిషన్‌..మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభం‌..నేటి ఆటో అప్‌డేట్స్‌!

హ్యుందాయ్‌ ఇండియా (Hyundai Motor India) క్రెటా (Creta) కారులో 2022 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది.....

Published : 03 May 2022 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యుందాయ్‌ ఇండియా (Hyundai Motor India) క్రెటా (Creta) కారులో 2022 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. పాత దాంతో పోలిస్తే దీంట్లో చాలా మార్పులు చేసినట్లు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’ ఫీచర్లు ఇప్పుడు అన్ని ట్రిమ్‌లలో పొందుపర్చారు. క్రెటా 1.5 పెట్రోల్‌ ఎస్‌ ట్రిమ్‌లో ‘ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌’ను ఇస్తున్నారు. దీని ధర రూ.12.83 లక్షలు (ఎక్స్‌షోరూం).

కొత్తగా డీసీటీ గేర్‌బాక్స్ కలిగిన 1.4 T-GDi టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో కూడిన ఎస్‌+ వేరియంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ వెర్షన్‌లో పానరోమిక్‌ సన్‌రూఫ్‌, 16-అంగుళాల అలాయ్‌ వీల్స్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, రేర్‌ డిస్క్‌ బ్రేక్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, పవర్‌ విండో.. వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

క్రెటాలో నైట్‌ ఎడిషన్‌ (Creta Knight Edition)ను కూడా హ్యుందాయ్‌ మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.13.51-18.18 లక్షలు (ఎక్స్‌షోరూం). దీంట్లో పెట్రోల్‌, డీజిల్‌ ట్రిమ్స్‌ ఉన్నాయి. పెట్రోల్‌ ట్రిమ్‌ 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో వస్తోంది. దీని ధర రూ.13.51-17.22 లక్షలు. డీజిల్ వేరియంట్లు కూడా మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.14.47-18.18 లక్షలు.


జీప్‌ ఇండియా మెరిడియన్‌ బుకింగ్స్‌ ప్రారంభం

కొత్తగా తీసుకొస్తున్న ఎస్‌యూవీ (SUV) మెరిడియన్‌ (Meridian) బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు జీప్‌ ఇండియా (Jeep India) మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో తయారీ ప్రారంభమైనట్లు తెలిపింది. జీప్‌ ఇండియా (Jeep India) డీలర్‌షిప్‌లు లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. డౌన్‌పేమెంట్‌ కింద రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయి.

ఈ కారులో మూడు వరుసల్లో 7 సీట్లు ఉంటాయి. 2-లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌తో వస్తోంది. 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్స్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్లలో ఇది అందుబాటులో ఉంది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న టయోటా ఫార్చునర్‌కి పోటీగా దీన్ని తీసుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని