Hyundai: హ్యుందాయ్‌ నుంచి మరో కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 631 కి.మీ.

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో అయోనిక్‌5 ఎస్‌యూవీని విడుదల చేసింది.

Published : 21 Dec 2022 18:52 IST

న్యూదిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది హ్యుందాయ్‌ సంస్థ. ఇప్పటికే కోనా పేరుతో ఈవీ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్తగా తన వాహన శ్రేణిలోని ఎస్‌యూవీ విభాగంలో అయోనిక్‌5ను తీసుకొచ్చింది. రూ.లక్షతో బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ మంగళవారం ప్రకటించింది.

అధునాతన టెక్నాలజీ, సరికొత్త హంగులతో అయోనిక్‌5  ఈవీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది హ్యుందాయ్‌. ఈ కారుకు 20అంగుళాల అలాయ్‌ వీల్స్‌ అమర్చారు. వర్చువల్‌ ఇంజిన్‌ సౌండ్‌ సిస్టమ్‌ (VESS) కలిగి ఉంటుంది. ఇంటర్నేషనల్‌ మోడల్‌ రెండు వేరియంట్స్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 72.6 కిలోవాట్‌ బ్యాటరీ కలిగిన వాహనం ఒకసారి ఛార్జ్‌ చేస్తే 631 కి.మీ.(ఏఆర్‌ఏఐ ధ్రువీకరించిన దూరం) ప్రయాణించవచ్చు. ఇక 58 కిలోవాట్‌, బ్యాటరీ వేరియంట్‌ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే, వరుసగా 385 కి.మీ. వెళ్లవచ్చు. 100కి.మీ వేగాన్ని కేవలం 7.6 సెకన్లలో అయోనిక్‌5 అందుకుంటుంది. ఇక 10 నుంచి 80శాతం ఛార్జింగ్‌ అవడానికి కేవలం 18 నిమిషాలు సరిపోతాయని హ్యుందాయ్‌ చెబుతోంది.

అయోనిక్‌5 ప్రత్యేకతలు

* ఈ కారులో ఈ-జీఎమ్‌పీ మోడల్‌తో కూడిన రెండు బ్యాటరీలున్నాయి. అవి 58 కేడబ్యూహెచ్‌ 72.6 కేడబ్యూహెచ్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. 350కేడబ్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో ఈ బ్యాటరీలకు ఛార్జింగ్‌  పెట్టుకోవచ్చు.

*12.3 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్‌ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంటుంది.

*బయట ఎల్‌ఈడీ హెడ్‌ లైట్లుంటాయి. ఎల్‌ఈడీ డే టైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్‌, టైల్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. వైర్‌ లేకుండా సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకొనే వెసులుబాటు ఉంది.

* దీని ధర 45-50 లక్షల మధ్య ఉండే అవకాశ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని