Hyundai IPO: అతిపెద్ద ఐపీఓకు హ్యుందాయ్‌ రెడీ.. త్వరలో సెబీకి దరఖాస్తు

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఐపీఓకు సిద్ధమవుతోంది. రూ.25 వేల కోట్లు సమీకరించాలనుకుంటోంది.

Published : 14 Jun 2024 20:24 IST

Hyundai IPO | దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్స్‌ భారత విభాగం ఐపీఓకు (Hyundai IPO) సిద్ధమవుతోంది. సుమారు రూ.3 బిలియన్‌ డాలర్లు (రూ.25వేల కోట్లు) మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఇందుకోసం త్వరలోనే సెబీకి దరఖాస్తు చేయబోతున్నట్లు సమాచారం. అన్నీ సజావుగా జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. గతంలో ఎల్‌ఐసీ ఐపీఓ రూపంలో రూ.21 వేల కోట్లు సమీకరించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా ఉంది. 

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ తొలిసారి 2003లో ఐపీఓకు వచ్చింది. ఇటీవలే విద్యుత్‌ వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ సెబీ నుంచి అనుమతులు పొందింది. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా హ్యుందాయ్‌ మోటార్స్‌ 15-20 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. 1996లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్‌ మోటార్స్‌..  వివిధ విభాగాల్లో 13 మోడళ్లను విక్రయిస్తోంది. మారుతీసుజుకీ తర్వాత రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని