Hyundai IPO: ఐపీఓకు హ్యుందాయ్‌ రెడీ.. సెబీకి పత్రాల సమర్పణ

Hyundai IPO: ఐపీఓ కోసం హ్యుందాయ్‌ మోటార్‌ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆమోదం లభించడమే తరువాయి.

Published : 15 Jun 2024 14:42 IST

Hyundai IPO | దిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ భారత విభాగం పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు (Hyundai IPO) సిద్ధమైంది. 3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీకి (SEBI) ముసాయిదా పత్రాలను సమర్పించింది. సెబీ ఆమోదం లభిస్తే.. ఎల్‌ఐసీ ఐపీఓ (రూ.21,000 కోట్లు)ను అధిగమించి దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుంది.

రిటైల్‌ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్‌ జాగ్రత్త

హ్యుందాయ్‌ ఐపీఓ మొత్తం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన జరగనుంది. ఐపీఓలో భాగంగా 142,194,700 (14.21 కోట్ల) ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్‌ షేర్ల జారీ ఉండదు. 1996లో భారత్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం 13 మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో 7% వృద్ధితో 63,551 వాహనాలను ఇది విక్రయించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్న తొలి వాహన కంపెనీ కూడా ఇదే అవుతుంది. 2003లో జపాన్‌ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని