Price hike: వాటి బాటలోనే హ్యుందాయ్‌.. జనవరి నుంచి కార్ల ధరల పెంపు

Hyundai price hike: జనవరి నుంచి తమ కార్ల ధరలు పెంచనున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించింది. అన్ని మోడళ్లకూ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.

Published : 15 Dec 2022 14:59 IST

దిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India Ltd) సైతం ధరల పెంపును (price hike) ప్రకటించింది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. అయితే, ఎంతమొత్తం పెంచేదీ కంపెనీ వెల్లడించలేదు.

దేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్‌ (Tata Motors), మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes-Benz), ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ తమ వాహనాల ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హ్యుందాయ్‌ సైతం అన్ని మోడళ్లపైనా ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. వినియోగదారులపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గ్రాండ్‌ ఐ10 NIOS, ఐ20, ఐ20 ఎన్‌లైన్‌, వెర్నా, క్రెటా వంటి తదితర మోడళ్లను హ్యుందాయ్‌ దేశంలో విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు