Hyundai: హ్యుందాయ్ నుంచి త్వరలో మరో SUV

Hyundai Exter: దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా (Hyundai Motors India Ltd) మరో కొత్త ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Published : 14 Apr 2023 16:40 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా (Hyundai Motors India) మరో కొత్త ఎస్‌యూవీ (SUV)ని తీసుకురాబోతోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ (Hyundai Exter) పేరుతో ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు శుక్రవారం (ఏప్రిల్‌ 14) ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న ఎస్‌యూవీ జాబితాలో మరొకటి చేరనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ కొత్త ఎస్‌యూవీని మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ ఎస్‌యూవీని ప్రకటించినందుకు గర్వంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్‌ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. హ్యుందాయ్ నుంచి వస్తున్న ఎనిమిదో  ఎస్‌యూవీ ఇదన్నారు. రానున్న రోజుల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరింత వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, అల్కాజర్, కోనా ఎలక్ట్రిక్, టస్కన్‌, ఐయోనిక్ 5 పేరిట హ్యుందాయ్‌ ఇప్పటికే పలు ఎస్‌యూవీలను మార్కెట్లో విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని