Hyundai recall: 70 వేల హ్యుందాయ్‌ వాహనాల రీకాల్‌.. ఎందుకంటే?

హ్యుందాయ్‌ దాదాపు 70 వేల వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్‌ చేయనున్నట్లు కేంద్ర రవాణామంత్రిత్వ శాఖ తెలిపింది....

Published : 11 Aug 2022 21:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యుందాయ్‌ దాదాపు 70 వేల వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్‌ చేయనున్నట్లు కేంద్ర రవాణామంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ఎక్స్‌సియెంట్‌ క్యూజెడ్‌ హెవీ డ్యూటీ ట్రక్‌’, ‘కౌంటీ బస్‌’ సహా మొత్తం ఆరు మోడళ్లకు చెందిన వాహనాలను కంపెనీ రీకాల్‌ చేయనుంది. కొన్ని పరికరాల్లో ఉన్న లోపాల్ని సరిచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

హ్యుందాయ్‌తోపాటు మెర్సిడెజ్‌ బెంజ్‌ కొరియా కూడా ఐదు మోడళ్లకు చెందిన 438 యూనిట్ల వాహనాలను రీకాల్‌ చేయాలని నిర్ణయించింది. ఈక్యూఈ 350+, ఈక్యూఎస్‌ 450+ విద్యుత్తు సెడాన్‌లను ఈ కంపెనీ రీకాల్‌ చేయనుంది. హ్యుందాయ్‌లో ఆల్టర్నేటర్‌ పరికరంలో లోపం వల్ల పవర్‌ ఔటేజ్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని కంపెనీ గుర్తించింది. మరోవైపు పైన పేర్కొన్న మెర్సిడెజ్‌ బెంజ్‌ మోడళ్లలో ‘పింటిల్‌ హుక్‌’లో లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ మోడళ్లను కొనుగోలు చేసిన వినియోగదారులు వెంటనే దగ్గర్లోని సర్వీస్‌ సెంటర్లకు వెళ్లి లోపాలున్న విడిభాగాలను మార్పించుకోవాలని కంపెనీలు కోరాయి. దీనికి ఎలాంటి రుసుము వసూలు చేయబోరని స్పష్టం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని