Hyundai: హ్యుందాయ్‌ నుంచి వెన్యూ ఎన్‌లైన్‌.. ధర ₹12.16 లక్షలు

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ (Hyundai) మరో కొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Published : 06 Sep 2022 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ (Hyundai) మరో కొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వెన్యూ ఎన్‌ లైన్‌ (Venue N Line) పేరిట కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. దీంట్లో రెండు వేరియంట్లు లభ్యమవుతాయి. ఎన్‌6 వేరియంట్‌ ధరను రూ.12.16 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌), ఎన్‌8 వేరియంట్‌ ధరను రూ.13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్‌ కావాలంటే రూ.15వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్‌ లైన్‌ సిరీస్‌లో ఐ20 ఎన్‌లైన్‌ను హ్యుందాయ్‌ గతేడాది లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో ఇది రెండో కారు. వెన్యూ ఎన్‌లైన్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా.. 1.3 లక్షల యూనిట్లు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

వెన్యూ ఎన్‌ లైన్‌ 1 లీర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 7 స్పీడ్‌ డీసీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. 88.3 kw (120 PS) పవర్‌ని, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కార్‌ వాయిస్‌ కమాండ్‌, 2.31 అంగుళాల ఎల్‌సీడీ డ్యాష్‌కామ్‌, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. హ్యుందాయ్‌ ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజార్‌, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌ పేరిట ఎస్‌యూవీలను విక్రయిస్తుండగా.. వెన్యూ ఎన్‌ లైన్‌ తాజాగా ఆ జాబితాలో చేరింది. వచ్చే ఏడాది కల్లా నెలకు 10 వేల మార్కు విక్రయాలను ఎన్‌లైన్‌ అందుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని