ICICI Bank: కొత్త సంవత్సరం నుంచి కొత్త రుసుములు

ఐసీఐసీఐసీ బ్యాంక్‌ ఖాతాదారులకు ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాది 2022 జనవరి 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌పై సర్వీస్‌ ఛార్జీలను సవరించనున్నట్లు

Updated : 04 Dec 2021 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐసీ బ్యాంక్‌ ఖాతాదారులకు ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాది 2022 జనవరి 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌పై సర్వీస్‌ ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు... ఏటీఎంలో నగదు లావాదేవీల్లోనూ మార్పులు చేసింది. 
2022 జనవరి 1 నుంచి  అమలు అయ్యేవి ఇవే...

* ఖాతాదారులు ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. 

*  ఆతరువాత  ప్రతి లావాదేవీపై రూ.20ను ఏటీఎం  ఛార్జీలుగా వసూలు చేస్తారు.

* ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో  నెలకు మూడు సార్లు, ఇతర నగరాల్లో ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు ( ఇందులో ఫైనాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లు కూడా భాగమై ఉంటాయి)

ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచుకునేందుకూ ఆర్‌బీఐ ఆమోదించిన నేపథ్యంలో, ఆర్థిక లావాదేవీలపై రుసుము పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని