ICICI BANK: ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. తాజా వ‌డ్డీ రేట్లు 

సీనియ‌ర్ సిటిజ‌న్ల డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు(బిపీఎస్‌) అదన‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.

Updated : 06 Dec 2021 17:29 IST

ప్ర‌ముఖ ప్రైవైట్‌ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌(ఎఫ్‌డీ)పై వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. 7 రోజుల నుంచి మొద‌లుకుని 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల‌తో కూడిన ఎఫ్‌డీల‌ను బ్యాంక్ అందిస్తుంది. వ‌డ్డీ రేటు కాల‌ప‌ర‌మితిని అనుస‌రించి 2.5 శాతం నుంచి 5.50 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఈ రేట్లు న‌వంబ‌రు 16, 2021 నుంచి వ‌ర్తిస్తాయ‌ని బ్యాంక్ తెలిపింది. 

రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఐసిఐసిఐ బ్యాంక్ అందిస్తున్న వ‌డ్డీ రేట్లు:
7 -14 రోజుల‌కు ... 2.50 శాతం
15 - 29 రోజుల‌కు ... 2.50 శాతం
30 - 45 రోజుల‌కు ... 3 శాతం
46 - 60 రోజుల‌కు ...3 శాతం
61 - రోజుల‌కు ... 3 శాతం
91 - 120 రోజుల‌కు ... 3.5 శాతం
121 - 184 రోజుల‌కు ... 3.5 శాతం
185 - 210 రోజుల‌కు ... 4.40 శాతం
211 - 270 రోజుల‌కు ... 4.40శాతం
271 - 289 రోజుల‌కు ... 4.40శాతం
290 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌కు ... 4.40శాతం
ఏడాది నుంచి 389 రోజుల‌కు ... 4.9 శాతం
390 రోజుల నుంచి 18 నెల‌ల‌కు ... 4.9 శాతం
18 నెల‌ల నుంచి 2 ఏళ్ల లోపు ... 5 శాతం
2 సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 3 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై ... 5.15 శాతం
3 సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 5 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై ... 5.35 శాతం
5 సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై ... 5.50 శాతం

ఐసిఐసిఐ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్లు చేసే రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు(బిపీఎస్‌) అద‌నంగా వ‌డ్డీ అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్‌ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తుంది. దీని పేరు ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ. ఈ స్కీమ్ కింద 5 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై వార్షికంగా 0.30 శాతం అద‌న‌పు వ‌డ్డీని పొందుతారు. అంటే, సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే 0.80 శాతం అద‌న‌పు వ‌డ్డీని సినియ‌ర్ సిటిజ‌న్లు పొందుతారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని