FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ICICI బ్యాంక్‌

ఈ సెప్టెంబ‌రు 30 నుంచి వ‌డ్డీ రేట్ల‌ను 20 బేసిస్ పాయింట్లు వ‌ర‌కు పెంచింది.

Published : 01 Oct 2022 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని కాల‌వ్య‌వ‌ధుల‌కు ఈ సెప్టెంబ‌రు 30 నుంచి వ‌డ్డీ రేట్ల‌ను 20-25 బేసిస్ పాయింట్లు వ‌ర‌కు పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల పెంపును వెల్ల‌డించిన రోజే ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణ‌యం తీసుకుంది. 7 రోజుల నుంచి 5 సంవ‌త్స‌రాల ఎఫ్‌డీల‌కు  3% నుంచి 6.10% వ‌ర‌కు వ‌డ్డీని బ్యాంకు  ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు అద‌నంగా 0.50% వ‌డ్డీని పొందుతారు. అంటే వారు గ‌రిష్ఠంగా 6.60% వ‌ర‌కు వ‌డ్డీ పొందుతారు. రూ.2 కోట్ల లోపు డిపాజిట్‌దార్ల‌కు ఈ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి.

రూ.2 కోట్లు దాటి రూ.5 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌డీల కేట‌గిరీలో 7 రోజుల నుంచి 5 సంవ‌త్స‌రాల ఎఫ్‌డీల‌కు  3.75% నుంచి 6.25% వ‌ర‌కు వ‌డ్డీని బ్యాంకు  ప్ర‌క‌టించింది. ఈ కేట‌గిరీలో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌న‌పు వ‌డ్డీ లేదు.

ఐసీఐసీఐ బ్యాంకు Golden Years FD: 5 సంవ‌త్స‌రాలు పైబ‌డిన ఈ ఎఫ్‌డీల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్లకు ప్ర‌స్తుతం వ‌చ్చే వ‌డ్డీ కంటే 0.10% అద‌న‌పు వ‌డ్డీని పొందొచ్చు. వారు పొందే 0.50% అద‌న‌పు వ‌డ్డీకి.. ఈ 0.10% వ‌డ్డీ అద‌నం. ఈ ప‌థ‌కంలో డిపాజిట్ చేయ‌డానికి గ‌డువు అక్టోబ‌రు 7, 2022 వ‌ర‌కు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని