Updated : 11 Jul 2022 16:38 IST

ICICI ఖాతాదారులకు అలర్ట్‌.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేజ్‌లతో భద్రం!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక.. నగదు బదిలీ నుంచి ఈఎంఐ, బిల్లుల చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతున్నాయి. అదే సమయంలో వినియోగదారుల ఖాతాలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ఈ-మెయిల్‌, స్పామ్‌ కాల్స్‌, సోషల్‌ మీడియా, మాల్‌వేర్‌ వెబ్‌లింక్స్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై బ్యాంకులు ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, అవగాహన కల్పిస్తున్నాయి. అయినా కూడా సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చి, యూజర్లను ఏమార్చి ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా జరుగుతున్న మోసాలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు కొన్ని సూచనలు జారీచేసింది.

 ‘‘ఫోన్‌ కాల్‌ ద్వారా యూజర్లను ఏమార్చి వారి యూపీఐ పిన్‌ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అటువంటి వాటిని నమ్మొద్దు. సైబర్‌ నేరగాళ్లు యూజర్లను మోసం చేసేందుకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా నగదు రిక్వెస్ట్ మెసేజ్‌లు పంపుతున్నారు. యూజర్‌ను నమ్మించేందుకు సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారులకు పరిచయమున్న వ్యక్తుల ఫొటోలను వాడుతున్నారు. ఒకవేళ అలాంటి రిక్వెస్టులు వస్తే ముందుగా సదరు ఖాతా ఒరిజినల్‌ ఖాతా అవునా? కాదా? అనేది గుర్తించాలి. మీకు అనుమానం కలిగితే వెంటనే సదరు సోషల్‌ మీడియా ఖాతాపై ఫిర్యాదు చేయండి’’ అని ఐసీఐసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలానే ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండేదుకు యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. 

  • మెసేజ్‌ల ద్వారా వచ్చే యూఆర్‌ఎల్‌ లేదా వెబ్‌లింక్స్‌ను ఓపెన్ చేయకపోవడం ఉత్తమం.
  • మీ ఫోన్‌ ఎవరికైనా ఇచ్చేముందు బ్రౌజర్‌ హిస్టరీ, క్యాచీ, టెంప్రరీ ఫైల్స్ బ్లాక్‌ చేయడంతోపాటు, మొబైల్‌ బ్యాకింగ్ యాప్‌ల యాక్సెస్‌ను బ్లాక్ చేయండి.
  • యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్ యాప్‌ స్టోర్‌ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ డౌన్‌లోడింగ్‌ కోసం వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దు. 
  • ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలను మెసేజ్‌, ఈ-మెయిల్‌ ద్వారా షేర్‌ చేయకూడదు. 
  • ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా మీ లావాదేవీలు పూర్తయిన వెంటనే యాప్‌ నుంచి లాగౌట్‌ అవ్వండి. 
  • బహిరంగా ప్రదేశాల్లోని వైఫై కనెక్షన్‌ ద్వారా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవాలు చేయవద్దు. 
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని