ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ

ICICI FD rates: ఐసీఐసీఐ బ్యాంకు తన ఎఫ్‌డీలపై 50 బీపీఎస్‌ వరకు వడ్డీ రేట్లను పెంచింది.

Published : 24 Feb 2023 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కాలవ్యవధులపై 50 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య డిపాజిట్‌ చేసే సాధారణ డిపాజిటర్లకు 3% నుంచి 7.10% వరకు వడ్డీ రేట్లను బ్యాంకు అందిస్తోంది. ఇప్పుడు సాధారణ డిపాజిటర్లు 7 రోజుల నుంచి 14 రోజుల వరకు కనిష్ఠంగా 3% వడ్డీని అందుకుంటారు. 15 నుంచి 18 నెలల డిపాజిట్లపై గరిష్ఠంగా 7.10% వడ్డీని పొందుతారు. ఇవే కాలవ్యవధులకు సీనియర్‌ సిటిజన్లు అదనంగా 0.50% వడ్డీని అందుకుంటారు. అంటే సీనియర్‌ సిటిజన్లు గరిష్ఠంగా 7.60% వరకు వడ్డీని పొందుతారు.

పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ పౌరులకు 7% వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ‘గోల్డెన్‌ ఇయర్స్‌’ ఎఫ్‌డీ కింద సీనియర్‌ సిటిజన్లు 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై ప్రస్తుతం 0.50% అదనపు వడ్డీ రేటుతో పాటు ఇంకా 0.10% అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఈ పథకం 2023 ఏప్రిల్‌ 7 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త ఎఫ్‌డీ రేట్లు 2023 ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్ల వరకు రిటైల్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని