ట్రాన్స్‌పోర్టేష‌న్ అండ్‌ లాజిస్టిక్స్ ఫండ్‌ను ప్రారంభించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్

అతిపెద్ద మార్కెటైన భార‌త్‌లో ఆటోమొబైల్ రంగం ఉనికి విస్తృతంగా ఉంది.

Published : 30 Sep 2022 12:43 IST

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ కొత్త‌గా ట్రాన్స్‌పోర్టేష‌న్ & లాజిస్టిక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫండ్ ఆఫ‌ర్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ అక్టోబ‌రు 6న ప్రారంభ‌మై అక్టోబ‌రు 20న ముగుస్తుంది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌. క‌నీస ద‌ర‌ఖాస్తు మొత్తం రూ. 5,000. ఈ ఫండ్ ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని నిఫ్టీ.. ట్రాన్స్‌పోర్టేష‌న్ & లాజిస్టిక్స్ ఇండెక్స్‌లో భాగ‌మైన రంగాలు లేదా దీనికి సంబంధించిన స్టాక్‌ల‌లో పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం ఉంది. ఈ ఫండ్‌లో పెట్టిన పెట్టుబ‌డిని 5 సంవ‌త్స‌రాలు నిల‌క‌డ‌గా ఉంచితే ఆశించిన ఫ‌లితాలు ఉంటాయ‌ని ఫండ్ వ‌ర్గాల అంచ‌నా.

భ‌విష్యత్తులో ర‌వాణా, లాజిస్టిక్స్ రంగాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఈ రంగంలో పెట్టుబ‌డులు వృద్ధికి ఎక్కువ అవ‌కాశాలుంటాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద మార్కెటైన భార‌త్‌లో ఆటోమొబైల్ రంగం ఉనికి విస్తృతంగా ఉంది. భ‌విష్య‌త్తులో ఇంధ‌న ధ‌ర‌లు, ఉద్గారాల‌ను త‌గ్గించ‌డానికి విద్యుత్ వాహ‌నాల ఉత్ప‌త్తి భారీ ఎత్తున జ‌రుగుతుంద‌ని, ఈ రంగానికి అనేక భారీ పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌ని ఫండ్ వ‌ర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు