IDBI Q4 Results: ఐడీబీఐ బ్యాంక్ లాభం 61 శాతం వృద్ధి
4వ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంకు నికరలాభం గణనీయంగా పెరిగింది.
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) స్టాండలోన్ నికర లాభం రూ.1,133 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది నికర లాభం రూ.691 కోట్లతో పోలిస్తే 64 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.3,279.60 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.2,420.50 కోట్ల)తో పోలిస్తే ఇది 35.3 శాతం పెరిగింది. బ్యాంక్ మూలధన కనీస నిష్పత్తి (CAR) 19.06 శాతం నుంచి 20.44 శాతానికి మెరుగుపడింది.
ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు 47 శాతం పెరిగి రూ.983.63 కోట్లకు చేరుకున్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు (NPA) విషయంలో బ్యాంకు గణనీయమైన మెరుగుదల నమోదు చేసింది. గతేడాది 13.82 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు.. 6.38 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు సైతం 1.08 శాతం నుంచి 0.92 శాతానికి పడిపోయింది. రూ.10 ముఖ విలువ గలిగిన ఈక్విటీ షేరుకు రూ.1 చొప్పున బోర్డు ఆఫ్ డైరక్టర్లు సిఫార్సు చేశారు. ఏప్రిల్ 28న ఐడీబీఐ బ్యాంకు షేరు NSEలో రూ.54.55 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు