IT Returns:2 ఏళ్లుగా రిటర్నులు దాఖలు చేయలేదా?

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) రూపంలో రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది.....

Updated : 23 Jun 2021 11:34 IST

టీడీఎస్‌/టీసీఎస్‌ రూ.50,000 మించితే 1 నుంచి అధిక పన్ను

ఈనాడు, హైదరాబాద్‌: గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) రూపంలో రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్‌ పర్సన్స్‌)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి వద్ద అధిక పన్ను వసూలు చేయాలని 2021 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం సర్క్యులర్‌ జారీ చేసింది.  టీడీఎస్‌, టీసీఎస్‌ చేసేవారు.. వ్యక్తుల శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను నమోదు చేయగానే ఆ ‘పత్యేక వ్యక్తుల’కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఆయా వ్యక్తులు అధిక శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని