
Credit Card: వేసవి విహారయాత్రకు వెళుతున్నారా? ఈ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ నుంచి కోలుకుంటున్న ప్రపంచం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ప్రయాణాలపై నియంత్రణల్ని ప్రభుత్వాలు ఎత్తివేస్తున్నాయి. త్వరలో భారత్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో గత రెండేళ్లుగా విహారయాత్రలకు దూరంగా ఉన్నవారంతా ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. మరి సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం కొన్ని బ్యాంకులు విమానయాన సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం..
కొటాక్ ఇండిగో కా-చింగ్ 6ఈ ఎక్స్‌ఎల్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు: స్వాగత ఆఫర్ కింద రూ.3,000 విలువ చేసే విమాన టికెట్లు; రూ.5,000 విలువ చేసే ఎకార్ హోటల్ డైనింగ్ వోచర్; రూ.899 యాడ్-ఆన్ తీసుకుంటే ప్రియారిటీ చెక్-ఇన్, కాంప్లిమెంటరీ మీల్, బ్యాగేజ్ అసిస్టెన్స్; భారత్‌లో 8 ఎయిర్‌పోర్టు లాంజ్ అనుమతులు; కార్డు స్వైప్ చేసిన ప్రతిసారి 6ఈ రివార్డు పాయింట్లు వస్తాయి. వీటిని ఇండిగో టికెట్ల కొనుగోలు సమయంలో వినియోగించుకోవచ్చు;
వార్షిక రుసుము: రూ.2,500
ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డు
ప్రయోజనాలు: స్వాగత ఆఫర్ కింద 20,000 రివార్డు పాయింట్లు; ఎయిరిండియా పోర్టళ్ల ద్వారా టికెట్ల కొనుగోలుకు చేసే ప్రతి రూ.100కు 30 రివార్డు పాయింట్లు; ఎయిరిండియా ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ప్రోగ్రాంలో సభ్యత్వం; ఏటా 1,00,000 బోనస్ రివార్డు పాయింట్లు, 600కు పైగా ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ అనుమతి.
వార్షిక రుసుము: రూ.4,999
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు: వార్షిక రుసుము చెల్లిస్తే ఒక ప్రీమియం ఎకానమీ టికెట్ ఉచితం; రూ.8 లక్షలు ఖర్చు చేస్తే రూ.10,000 విలువ చేసే యాత్రా హోటల్ ఈ-వోచర్; రూ.7,457 విలువ చేసే ప్రియారిటీ పాస్ సభ్యత్వం; భారత్‌లో 8 ఎయిర్‌పోర్టు లాంజ్ అనుమతులు.
వార్షిక రుసుము: రూ.2,999
ఇతిహాద్ గెస్ట్ ఎస్‌బీఐ ప్రీమియర్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు: స్వాగత ఆఫర్ కింద 5,000 ఇతిహాద్ గెస్ట్ మైళ్లు ఉచితం (ఒక మైల్ రెండు యూఎస్ సెంట్లకు సమానం); తొలి లావాదేవీ తర్వాత ఇతిహాద్ గెస్ట్ గోల్డ్ టైర్ హోదా; ఒక త్రైమాసికంలో రూ.1.5 లక్షల ఖర్చుకు 1,500 ఇతిహాద్ మైళ్లు ఉచితం; భారత్‌లో 12, విదేశాల్లో 06 ఎయిర్‌పోర్టు లాంజ్‌లు ఉచితం.
వార్షిక రుసుము: రూ.4,999
యాక్సిస్ బ్యాంక్ విస్తారా ఇన్ఫినైట్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు: వెల్‌కమ్ గిఫ్ట్‌గా బిజినెస్ క్లాస్ టికెట్ వోచర్; ప్రియారిటీ చెక్-ఇన్, బోర్డింగ్, బ్యాగేజ్ అనుమతి కలిగిన క్లబ్ విస్తారా సభ్యత్వం; కార్డు వినియోగంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటే బిజినెస్ క్లాస్ టికెట్లు, బోనస్ క్లబ్ విస్తారా పాయింట్లు లభిస్తాయి.
వార్షిక రుసుము: రూ.10,000
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు: వార్షిక రుసుము చెల్లిస్తే ఒక ప్రీమియం ఎకానమీ టికెట్ ఉచితం; రూ.8 లక్షలు ఖర్చు చేస్తే రూ.10,000 విలువ చేసే యాత్రా హోటల్ ఈ-వోచర్; రూ.7,457 విలువ చేసే ప్రియారిటీ పాస్ సభ్యత్వం; భారత్‌లో 8 ఎయిర్‌పోర్టు లాంజ్ అనుమతులు.
వార్షిక రుసుము: 2,999
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
-
World News
Pakistan: పాక్‌లో తీవ్ర పేపర్ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!