India Growth: భారత్ వృద్ధిలో IMF కోత.. ఈ ఏడాది వృద్ధి 6.8 శాతమే
భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.
వాషింగ్టన్: భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించగా.. IMF సైతం తాజాగా అంచనాల్లో కోత విధించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 8.2 శాతం నమోదు చేయొచ్చని జనవరిలో IMF అంచనా వేసింది. అనంతరం వృద్ధి అంచనాల్లో కోత పెడుతూ 7.4 శాతంగా నమోదైనట్టు జులైలో పేర్కొంది. తాజా అంచనాల్లో మరోసారి 0.6 శాతం కోత పెడుతూ 6.8 శాతం మాత్రమే వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది. రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఉత్పత్తి తక్కువగా నమోదు కావడం, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండడం వంటి పరిణామాలే వృద్ధిలో కోత విధించడానికి గల కారణంగా IMF పేర్కొంది.
అలాగే, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం IMF వెలువరించింది. 2021లో 6 శాతంగా నమోదైన వృద్ధి రేటు ఈ ఏడాది 3.2 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కేవలం 2.7 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో లాక్డౌన్లు వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2021లో 8.1 శాతం వృద్ధిని సాధించిన చైనా ఈసారి 3.2 శాతానికి పరిమితం కానుందని IMF అంచనా కట్టింది. జీరో- కొవిడ్ పాలసీలో భాగంగా విధిస్తున్న లాక్డౌన్లే ఇందుకు కారణమని పేర్కొంది. అమెరికా వృద్ధి రేటు కేవలం ఒక్క శాతానికే పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఏ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్‌పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్‌ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్