Home Loan: శాంక్షన్ లెటర్ వస్తే.. రుణం వచ్చినట్లేనా?
Sanction letter details in Telugu: రుణ మంజూరు లేఖ మీరు రుణం పొందేందుకు అర్హులు అని మాత్రమే తెలియజేస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి కొనుగోలు కోసం డబ్బు సర్దుబాటు కానప్పుడు రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తాం. గృహ రుణం (Home Loan) పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. లోన్ ప్రాసెస్ అంతా సాఫీగా సాగాలంటే ప్రతి దశ గురించీ అవగాహన ఉండాలి. లోన్ ప్రాసెస్‌లో ముఖ్యమైనది రుణ మంజూరు లేఖ (Sanction letter). దీని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
శాంక్షన్ లెటర్ ఏం చెబుతోంది?
గృహ రుణ శాంక్షన్ లెటర్.. రుణ అర్హతను మాత్రమే తెలియజేస్తుంది. శాంక్షన్ లెటర్ వచ్చినంత మాత్రాన రుణం వచ్చినట్లు కాదు. రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. బ్యాంకు ముందుగా మీరు ఇచ్చిన దరఖాస్తు ఫారం, డాక్యుమెంట్లను పరిశీలించి మీ క్రెడిట్ యోగత్యను తనిఖీ చేస్తుంది. ఇందుకోసం మీ క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోరును విచారిస్తుంది. దీంతో పాటు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి ప్రస్తుత విలువ, కాలక్రమేణా అందించే విలువను కూడా చూస్తారు. ఇవి మూల్యాంకనం చేసి సంతృప్తి చెందితేనే గృహ రుణ అర్హతను తెలియజేస్తూ మంజూరు లేఖను జారీ చేస్తారు.
ఈ లేఖలో రుణ మొత్తం, వడ్డీ రేటు, వడ్డీ రేటు రకం (ఫ్లోటింగ్/ ఫిక్స్‌డ్ రేటు), పరిగణనలోకి తీసుకున్న బేస్ రేటు, తిరిగి చెల్లించే కాలం, ఈఎంఐ చెల్లింపు వివరాలు, మంజూరు లేఖ చెల్లుబాటు వ్యవధి, పన్ను ప్రయోజనాలు, ప్రత్యేక పథకాలు (వర్తిస్తే) వంటి వివరాలు ఉంటాయి. రుణ గ్రహీతలు ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రుణం తీసుకోవడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు.
రుణం తీసుకోవాలా? వద్దా?
రుణ మంజూరు లేఖ.. నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి, రుణ గ్రహీతలు మీ ఆదాయం, ఖర్చులను అనుసరించి బడ్జెట్ వేసుకుని నెలవారీగా ఈఎంఐ సక్రమంగా చెల్లించగలరా లేదా అనేది ఈ దశలోనే అంచనా వేసుకోవాలి. దాన్ని బట్టి రుణం తీసుకోవాలా లేదా అన్నది నిర్ణయించుకోవచ్చు.
ఫైనల్ లోన్ అగ్రిమెంటుకు, శాంక్షన్ లెటర్‌కు తేడా ఏంటి?
చాలా మంది రుణ మంజురు లేఖనే ఫైనల్ లోన్ అగ్రిమెంట్‌గా భావిస్తారు. ఈ రెండూ వేర్వేరు. రుణ మంజూరు లేఖ మీరు రుణం పొందేందుకు అర్హులు అని మాత్రమే తెలియజేస్తుంది. మంజూరు లేఖను స్వీకరించిన తర్వాత, ఇందులో ఇచ్చిన మొత్తం సమాచారం ఆమోదయోగ్యంగా అనిపిస్తే, రుణ గ్రహీత ఈ లేఖపై సంతకం చేసి బ్యాంకు వారికి అందిస్తే బ్యాంకు వారు తుది లోన్ ప్రాసెస్ ప్రారంభిస్తారు. ఇప్పుడు చాలా వరకు బ్యాంకులు రుణ మంజూరు లేఖను డిజిటల్‌గానే జారీ చేస్తున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు మీరు ఆస్తిని కొనుగోలు చేసేందుకు తుది నిర్ణయానికి ముందే రుణ మంజూరు లేఖను అడగవచ్చు.
గమనిక: రుణ మంజూరు లేఖకు చెల్లుబాటు అయ్యే వ్యవధి ఉంటుంది. రుణ గ్రహీతలు ఆ లోపు సంతకం చేసి అందిస్తేనే ప్రాసెస్ ప్రారంభిస్తారు. లేదంటే అక్కడితో రుణ ప్రాసెస్ నిలిపి వేస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు