మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

కుమార్ ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగి. ప్రభుత్వ బ్యాంకులో వేతన ఖాతా ఉంది. అందులో దాదాపు రూ. 1 లక్ష దాకా సొమ్ము ఉంది. లోకెర్ లో కొన్ని నగలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం లో కుమార్ చనిపోయాడు. ఉన్న సొమ్ము, నగలు అన్నీ బ్యాంకులోని ఉండిపోయాయి. నామినీ గా ఎవరూ లేకపోవడం తో బ్యాంకు ..

Published : 16 Dec 2020 18:54 IST

కుమార్ ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగి. ప్రభుత్వ బ్యాంకులో వేతన ఖాతా ఉంది. అందులో దాదాపు రూ. 1 లక్ష దాకా సొమ్ము ఉంది. లోకెర్ లో కొన్ని నగలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం లో కుమార్ చనిపోయాడు. ఉన్న సొమ్ము, నగలు అన్నీ బ్యాంకులోని ఉండిపోయాయి. నామినీ గా ఎవరూ లేకపోవడం తో బ్యాంకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు లాంటివి తీసుకువచ్చే సరికీ బాగా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సమయం లో అరేబిఐ అందించిన నివేదిక ప్రకారం సుమారుగా రూ. 1100 కోట్ల రూపాయల వరకు సొమ్ము ఇలా వృధాగా ఉండిపోయిందని తెలుస్తోంది. ఈ సొమ్ము ప్రధానంగా వ్యక్తిగత ఖాతాదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందినదని తెలుస్తోంది. ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే…ఆ ఖాతాదారుడు మరణించడమే.

బ్యాంకు ఖాతా లో నామినీ ఎవరినీ నియమించకపోవడం తో వస్తున్నా ఇలాంటి చిక్కులను తొలగించడానికి భారత ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టం 1983 కు కొన్ని మార్పులు చేసింది. ఇందులో బ్యాంకులు తమ ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించింది. దానితో కొత్త ఖాతాలు ప్రారంభించేటప్పుడు బ్యాంకులు నామినీ ని పేర్కొనడం తప్పనిసరి చేసాయి. వస్తున్నా ఇబ్బందల్లా ఇప్పటికే ఉన్న ఖాతాల వల్లే. పాత ఖాతాదారులకు నామినీ నియమించాల్సిందిగా బ్యాంకులు సూచిస్తున్నప్పటికీ పట్టించుకుంటున్న ఖాతాదారులు తక్కువే. కొంతమందికి ఈ విషయం గురించి అసలు అవగాహనే లేదన్నది కూడా గమనించాల్సిన విషయం. దానితో ఖాతాదారుడికి ఏదైనా జరగరానిది జరిగితే అతని వారసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ నామినేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరం.

ఏం చేయాలి?

బ్యాంకులో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఖాతా తెరిచినప్పుడు లేదా గతం లో ప్రారంభించినా నామినేషన్ సౌకర్యం కోసం బ్యాంకును సంప్రదించండి. దీని కోసం ఫారం డీఏ-1 పూర్తి చేసి బ్యాంకు కి ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ గా మీ ఇష్టం వచ్చిన వ్యక్ట్ని ని పేర్కొనవచ్చు. ఖాతాదారుడికి అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు ఖాతా లో ఉన్న సొమ్ము సులభంగా ఖాతాదారుడికి అందుతుంది.

అన్ని రకాల డిపాజిట్లు, అంటే రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్, పొదుపు, కరెంటు ఇలా అన్నింటికీ నామినీ నియమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ముందు ఇచ్చిన నామినీ ని రద్దు చేసుకోవాలంటే ఫారం డీఏ-2 ద్వారా చేసుకోవచ్చు. కొన్ని సార్లు నామినీ గా పేర్కొన్న వ్యక్తి దూరం కావచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ఫారం డీఏ-3 ద్వారా నామినీ పేరు మార్చుకోవాలి.

మైనర్ విషయం లో:

బ్యాంకు ఖాతా ఏదైనా సరే నామినీ ని నియమించాల్సిందే. మైనర్ ఖాతా ల విషయం లో అతని తరపున ఖాతా ను నిర్వహించే వ్యక్తి నామినీ ని నియమించాల్సి ఉంటుంది. నామినీ గా ఒక మైనర్ ఉంటే అతడు మేజర్ అయ్యేంత వరకూ మరొక వ్యక్తి ని మైనర్ తరపున పని చేసేందుకు నియమించాలి. అయితే నామినీ మేజర్ గా మారితే మాత్రం నిరభ్యంతరంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఉమ్మడి ఖాతాల విషయం లో:

ఉమ్మడి ఖాతా లో ఉన్న ఐదారిలో ఒక వ్యక్తి మరణిస్తే వెంటనే ఆ విషయాన్నీ బ్యాంకుకు తెలియజేసి, తగిన ధ్రువీకరణ పత్రాలని అందించాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకు ఆ ఖాతాదారుడికి ఖాతాను నిర్వహించే పూర్తి హక్కులు కల్పిస్తుంది. అప్పటి వరకూ ఉమ్మడి ఖాతా కు నామినీ ని నియమించకుంటే మిగిలిన ఖాతాదారుడే నామినీ ని నియమించవచ్చు. ఉమ్మడి ఖాతా లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లకు మాత్రం నామినీ ని అందరూ కలిసి నియమించాలి, ఒకసారి నిర్ణయిస్తే ఆ డిపాజిట్ల కాల వ్యవధి ముగిసే వరకు అదే నామినీ కొనసాగుతారు.

చివరిగా:

బ్యాంకు కు సంబంధించినంత వరకూ ఖాతా కు నామినీయే హక్కుదారుడు. చట్టపరమైన వారసులకు ఎలాంటి హక్కూ ఉండదు. ఖాతాదారుడు మరణించిన 3 నెలల వరకు నామినీ ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే అతడికి బ్యాంకు నోటీసు పంపిస్తుంది. ఫిక్సిడ్ డిపాజిట్లను కూడా గడువు ముగిసే ముందే తీసుకోవడానికి బ్యాంకు అనుమతిస్తుంది. నామినీ కి వ్యతిరేకంగా చట్ట బద్ధమైన వారసులు దావా వేసుకోవచ్చు, ఇందులో బ్యాంకుని చేర్చడానికి వీలు కుదరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని