Income Tax: పన్ను చెల్లింపుదారులా? ఈ ఏడాది ముఖ్య తేదీలివే..
Imp dates for income tax payers: ఆదాయపు పన్ను విషయంలో ముఖ్య తేదీలను తెలుసుకుంటే.. గడువు తేదీలోపే పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పరిమితికి మించిన ఆదాయం ఉన్న వారు ఆదాయపు పన్నును చెల్లించాలి. పన్ను చెల్లింపుల్లో ఎటువంటి ఆలస్యం లేకపోతే.. పెనాల్టీల నుంచి దూరంగా ఉండొచ్చు. 2023కి సంబంధించి ఆదాయపు పన్ను ముఖ్య తేదీలను తెలుసుకుంటే.. గడువు తేదీలోపే పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత తేదీలను తెలుసుకుందాం.
1. జనవరి 30
ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ధ్రువీకరించడం తప్పనిసరి. ఐటీఆర్ ధ్రువీకరించేందుకు ఉన్న సమయాన్ని 2022 ఆగష్టు 1 నుంచి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్ను విభాగం) 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించింది. అందువల్ల ఆర్థిక సంవత్సరం 2021-22 (ఏవై 2022-23) కోసం ఆలస్యంగా అంటే 2022, డిసెంబరు 31కి ఐటీఆర్ దాఖలు చేసిన సవరించిన వ్యక్తులు 2023 జనవరి 30లోపు ధ్రువీకరణ పూర్తిచేయాలి. లేదంటే ఐటీఆర్ దాఖలు చేసినా ప్రయోజనం ఉండదు.
2. మార్చి 15
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే పన్ను చెల్లింపుదారులకు మార్చి 15 ముఖ్యమైన తేదీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదా చెల్లించేందకు ఇదే ఆఖరి తేదీ. ఒకవేళ సరైన సమయానికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్లు 234బి, 234సి కింద పెనాల్టీ వర్తిస్తుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. ముందస్తు పన్ను చెల్లించడంలో ఒకసారి విఫలమైతే తర్వాతి వాయిదాకు మూడు నెలల సమయం ఉంటుంది. కాబట్టి మూడు నెలలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
3. మార్చి 31
మార్చి 31తో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి, ఈ తేదీ చాలా ముఖ్యమైనది.
పన్ను ఆదా కోసం: మీరు పాత పన్ను విధానంలో రిటర్నులను ఫైల్ చేస్తుంటే.. పన్ను ఆదా పెట్టుబడులను పూర్తిచేసేందుకు చివరి తేదీ మార్చి 31. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు సెక్షన్ 80సి తీసుకుంటే.. పీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎస్ఎస్వై వంటి వివిధ మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అలాగే 80డి, 80టీటీఏ వంటి వివిధ సెక్షన్ల కింద మినహాయింపు కోసం మార్చి 31 లోపు పన్ను ఆదా పెట్టుబడులను పూర్తిచేయాలి.
ఐటీఆర్-U ఫైల్ చేసేందుకు: ఆర్థిక సంవత్సరం 2019-20 (ఏవై 2020-21) కోసం ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా లేదా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆదాయాన్నీ నివేదించకపోతే, మీరు అప్డేటెడ్ ఐటీఆర్ లేదా ఐటీఆర్-U ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చివరి తేదీ 2023, మార్చి 31. ఐటీఆర్-U ప్రభుత్వం 2022 బడ్జెట్లో ప్రకటించింది. ఐటీఆర్ ఫైల్ చేసే సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాల లోపు ఐటీఆర్-U ఫైల్ చేయవచ్చు.
ఫారం 10F: ద్వంద్వ పన్ను రద్దు ఒప్పందం (DTAA) ప్రయోజనాన్ని పొందాలనుకునే నాన్-రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఫారమ్ 10Fను సమర్పించాలి. పాన్ కార్డు లేని ఎన్నారైలు ఆన్లైన్ ద్వారా సమర్పించడం కుదరదు. కాబట్టి మాన్యువల్‌గా మార్చి 31 లోపు సమర్పించవచ్చు.
4. జూన్ 15
అడ్వాన్స్ ట్యాక్స్: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి వాయిదా చెల్లించేందుకు చివరి తేదీ.
ఫారం 16: ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం యజమాని నుంచి ఫారం 16 స్వీకరించేందకు చివరి తేదీ. ఫారం-16 అనేది టీడీఎస్ సర్టిఫికెట్. దీనిలో యాజమాని చెల్లించిన జీతం, మినహాయించిన పన్ను, ఇతర వివరాలు ఉంటాయి. ఆదాయపు పన్ను దాఖలు చేసేందుకు అవసరమైన ముఖ్య పత్రాల్లో ఇదీ ఒకటి.
5. జులై 31
ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 2023, జులై 31(ప్రభుత్వం చివరి తేదిని పొడిగిస్తే ఆ తేదీ వర్తిస్తుంది). ఒక వ్యక్తి ఈ గడువును కోల్పోతే ఆలస్య రుసుము చెల్లించి.. బిలేటెడ్ ITR ఫైల్ చేసే అవకాశం ఉంది.
6. సెప్టెంబరు 15
ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ రెండో వాయిదా చెల్లించేందు చివరి తేదీ.
7. డిసెంబరు 15
ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్ ట్యాక్స్ మూడో వాయిదా చెల్లించేందు చివరి తేదీ.
8. డిసెంబరు 31
ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఆలస్యపు లేదా సవరించిన ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం. -
Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి... -
Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి.. -
Insurance: బీమా సంస్థలందించే వివిధ పాలసీలు ఇవిగో..
నేడు మార్కెట్లో అనేక నష్టాలను కవర్ చేసే బీమా పథకాలు ఉన్నాయి. చాలా బీమా పాలసీలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు తీర్చిదిద్దాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..! -
ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం
భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. -
మ్యూచువల్ ఫండ్లు ఒకే రంగంలో మదుపు చేయాలంటే...
ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్ ఫండ్లు. -
ప్రభుత్వ హామీ పథకాల్లో
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 12న ముగుస్తుంది. -
పీపీఎఫ్, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి డెడ్‌లైన్ ఇదే..!
పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటి ప్రభుత్వ పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి.