Stocks on 52 Week High: ఒక్కరోజులో ఏడాది గరిష్ఠానికి 344 కంపెనీల షేర్లు!

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో గతవారపు లాభాల పరంపరను సోమవారమూ కొనసాగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 30 సూచీలో ఈ ఒక్కరోజే ఏకంగా 12 షేర్లు ఏడాది(52 వారాల) గరిష్ఠానికి చేరడం విశేషం.....

Published : 18 Oct 2021 22:35 IST

మార్కెట్ల ర్యాలీలో భారీగా లాభపడుతున్న కంపెనీలు

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో గతవారపు లాభాల పరంపర సోమవారమూ కొనసాగింది. సెన్సెక్స్ 61,963 వద్ద ‌, నిఫ్టీ 18,543 వద్ద జీవితకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 30 సూచీలో ఈ ఒక్కరోజే ఏకంగా 12 షేర్లు ఏడాది(52 వారాల) గరిష్ఠానికి చేరడం విశేషం. ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్(2,723.30), బజాజ్‌ ఫిన్‌సర్వ్(19107.45)‌, బజాజ్‌ ఫైనాన్స్(8020.20)‌, టైటన్‌(2,678.10), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, సన్‌ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్‌ కంపెనీలు ఉన్నాయి.

* బీఎస్‌ఈలో నమోదైన మొత్తం కంపెనీల్లో ఏకంగా 344 షేర్లు సోమవారం జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో నేడు అత్యధికంగా లాభపడిన వాటిలో బాటా ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, క్యాన్‌ ఫిన్‌ హోమ్స్‌, డీబీ రియాలిటీ, దివీస్‌, డిక్సన్‌ టెక్‌ ఇండియా, అవెన్యూ సూపర్‌మార్కెట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌.. వంటి కంపెనీలు ఉన్నాయి. 

* ఇక బీఎస్‌ఈ 200 సూచీలో 39 షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరాయి. ఈ కేటగిరీలో బాగా రాణించిన వాటిలో ఫెడరల్‌ బ్యాంక్‌, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌, ఐడీబీఐ బ్యాంక్‌, మారికో, ఎన్‌హెచ్‌పీసీ, టాటా పవర్‌, యూనియన్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వోల్టాస్ ఉన్నాయి.

* ఈ ర్యాలీలోనూ కొన్ని కంపెనీలు సోమవారం ప్రతికూలంగా ట్రేడయ్యాయి. అరిహంత్‌ ఇన్‌స్టిట్యూట్‌, జేఎస్‌ఏ ఇన్‌ఫ్రావిల్లే షాపర్స్‌, క్వాలిటీ క్రెడిట్‌ అండ్‌ లీజింగ్‌, సోర్స్‌ నాచురల్‌ ఫుడ్స్‌,హెర్బల్‌ సప్లయ్‌ వంటి కంపెనీలు ఏడాది కనిష్ఠానికి చేరడం గమనార్హం.

* ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలో 195 షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఆరు షేర్లు ఏడాది కనిష్ఠానికి దిగజారాయి. రాణించిన వాటిలో ఆర్తీ ఇండస్ట్రీస్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, బీఈఎంఎల్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌(ఇండియా), క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌, ఇరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, ఎగ్జారో టైల్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్ వంటి షేర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు