Income Tax: యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి?ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ఆదాయపుపన్ను శాఖ గత ఏడాది నవంబరులో వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ - AIS) ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థికసంవత్సరంలో చేసిన అన్ని లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. పన్నుచెల్లింపుదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పన్ను రిటర్నులను దాఖలు చేయాలనే ఉద్దేశ్యంతో ఆదాయపు శాఖ ఏఐఎస్‌ను తీసుకొచ్చింది.
ఫారం-26 ఏఎస్ ప్రాథమికంగా టీడీఎస్, టీసీఎస్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఏఐఎస్‌లో టీడీఎస్, టీసీఎస్ సమచారంతో పాటు జీతం ద్వారా వచ్చే ఆదాయం లేదా వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం, డివిడెండ్లు, బ్యాంకు పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ, స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలు, విదేశీ చెల్లింపులు, మ్యూచ్‌వల్ ఫండ్ లావాదేవీలు ఇలా..మొత్తం ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. నివేదించిన సమాచారం నుంచి నకిలీ సమాచారాన్ని తొలగించిన తర్వాత సమాచారం ఏఐఎస్‌లో పొందుపరుస్తారు. పన్ను చెల్లింపుదారులు ఈ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది ట్యాక్స్ పాస్‌బుక్. ఇందులో నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ కింది సమాచారం అందుబాటులో ఉంటుంది:
* టీడీఎస్, టీసీఎస్ సంబంధిత సమాచారం.
* నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలకు సబంధించిన సమాచారం
* పన్ను చెల్లింపులకు సంబంధించి
* డిమాండ్, రీఫండ్లకు సంబంధించి
* పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్ గురించిన సమాచారం
* పూర్తైన ప్రొసీడింగ్ల గురించి సమాచారం
* సూచించిన ఆదాయ పన్ను అధికారి అప్లోడ్ చేయదగిన ఇతర సమాచారం
ఏఐఎస్‌ను యాక్సెస్ చేసే విధానం..
* ఏఐఎస్‌ను యాక్సెస్ చేసేందుకు పన్నుచెల్లింపుదారుడు ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
* లాగిన్ అయిన తర్వాత 'సర్వీసెస్' ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న 'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)' లింక్‌ను క్లిక్ చేసి యాక్సెస్ చేయొచ్చు.
* ఇప్పుడు స్క్రీన్‌పై పాపప్ వస్తుంది. ఇక్కడ కనిపించే 'ప్రొసీడ్' బటన్‌ను క్లిక్ చేస్తే ఏఐఎస్ హోమ్ స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతుంది.
* ఇక్కడ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్)లకు సంబంధించిన కీలక సూచనలను అందిస్తుంది. ఏఐఎస్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కేటగిరీల వారీగా టీఐఎస్ చూపిస్తుంది. ఇది అసలు, సవరించిన విలువలను సూచిస్తుంది. టీఐఎస్‌లో సవరించిన విలువను రిటర్నుల ప్రీ-ఫైలింగ్‌లో ఉపయోగిస్తారు.
* ఏఐఎస్‌పై క్లిక్ చేస్తే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్), యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ రెండూ కనిపిస్తాయి. డ్రాప్‌డౌన్ మెనూలో కావలసిన ఆర్థిక సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకుని సమాచారం కోసం ఏఐఎస్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాతి స్క్రీన్‌లో ఏఐఎస్‌లో ఉన్న సమాచారం పార్ట్- ఏ, పార్ట్- బి అని రెండు భాగాలుగా డిస్ప్లే అవుతుంది. పార్ట్-ఏలో పన్ను చెల్లింపుదారుని గురించి సాధారణ సమాచారం ఉంటుంది. పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా మొదలైన వివరాలు ఉంటాయి.
పార్ట్-బిలో పన్ను చెల్లింపుదారుడు ఎంపిక చేసుకున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమగ్ర సమాచారం ఉంటుంది. పార్ట్-బిలో ఈ కింది కేటగిరీల్లో సమాచారం పొందుపరుస్తారు:
* టీడీఎస్/టీసీఎస్ సమాచారం
* ఎస్ఎఫ్టీ సమాచారం
* పన్ను చెల్లింపులు
* డిమాండ్ అండ్ రీఫండ్
* ఇతర సమాచారం
ప్రతి కేటగిరీకి సంబంధించిన సమాచారాన్ని విడివిడిగా ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఏఐఎస్‌ను పీడీఎఫ్ లేదా జెఎస్ఓఎన్లో డౌన్లోడ్ చేసుకునే వీలుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan: రైతులు, విద్యార్థుల కోసం ఎంతో చేశాం.. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్
-
Sports News
IND vs WI : విండీస్‌తో ఐదో టీ20.. నామమాత్రమే కానీ.. అందుకు ఇదే చివరి సన్నాహకం!
-
World News
Taiwan: తైవాన్‌పై గురిపెట్టిన డ్రాగన్.. రెచ్చిపోతున్న చైనా..
-
Sports News
Nikhat Zareen : నిఖత్ పసిడి పంచ్.. నాలుగో స్థానానికి భారత్
-
Movies News
Social Look: మేకప్మ్యాన్ని మెచ్చిన సన్నీ లియోనీ.. విజయ్‌తో అనన్య స్టిల్స్
-
General News
Telangana News: ఎస్ఐ పరీక్షకు 2.25లక్షల మంది హాజరు.. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...