ఫిక్స్‌డ్ డిపాజిట్ vs ఎన్ఎస్‌సీ - ప‌న్ను ఆదాకు ఏది మేలు?

ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, జాతీయ పొదుపు ప‌థ‌కం (ఎన్ఎస్‌సీ) వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడితే ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి తెలిసిందే.

Updated : 25 Dec 2020 20:36 IST

ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, జాతీయ పొదుపు ప‌థ‌కం (ఎన్ఎస్‌సీ) వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడితే ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి తెలిసిందే. చిన్న పొదుపు ప‌థ‌కాలు అయిన ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్ వంటి వాటిలో వ‌డ్డీ రేట్లు ప్ర‌తీ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తారు. ఎన్ఎస్‌సీ, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రెండింటికీ లాక్‌-ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు. ఎస్‌బీఐ వంటి బ్యాంకులు ప‌దేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప‌న్ను మిన‌హాయింపును ఇస్తున్నాయి.

ఎన్ఎస్‌సీ, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి 10 విష‌యాలు
ప్ర‌స్తుతం ఎన్ఎస్‌సీల పెట్టుబ‌డుల‌పై వార్షికంగా 7.9 శాతం వడ్డీ ల‌భిస్తుంది. ఇందులో రూ.100 డిపాజిట్ చేస్తే 5 సంవ‌త్స‌రాల‌కు రూ.144.23 జ‌మ‌వుతుంది.

♦ ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ ఐదేళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.85 శాతం వ‌డ్డీ ఇస్తుంద‌నుకోండి. దీనిని త్రైమాసికానికి ఒక‌సారి లెక్కిస్తారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా మ‌రో 50 బేసిస్ పాయింట్ల వ‌డ్డీ ల‌భిస్తుంది.

♦ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా ప‌న్ను ఆదా చేసేందుకు రూ.1000 క‌నీస బ్యాలెన్స్ అవ‌స‌ర‌మ‌నుకుంటే, ఆ త‌ర్వాత నుంచి డిపాజిట్‌ను పెంచుతూ పోవాలి. ఇది ఒక్కో బ్యాంకుకు వేరుగా ఉంటుంది. ఎన్ఎస్‌సీ ఖాతాను ప్రారంభించేందుకు క‌నీసం రూ.100 డిపాజిట్ చేయ‌ల‌సి ఉంటుంది. ఆ త‌ర్వాత డిపాజిట్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవాలి.

♦ బ్యాంకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఖాతాదారుడు నెల‌కు లేదా త్రైమాసికానికి చెల్లింపులు చేసే విధానాన్ని ఎంచుకోవ‌చ్చు లేదా మొత్తం క‌లిపి ఒక‌సారి తీసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇందులో ల‌భించిన‌ వ‌డ్డీని మొత్తానికి క‌లిపి దానిపై వ‌డ్డీ వ‌ర్తింప‌జేస్తారు.

♦ ఎన్ఎస్‌సీలో వ‌డ్డీ ఏడాదికోసారి చెల్లించే అవ‌కాశ‌ముండ‌దు. మొత్తం క‌లిపి ఒకేసారి అందిస్తారు.

♦ ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉమ్మ‌డిగా ప్రారంభిస్తే మొద‌టి వారికి మాత్ర‌మే ప‌న్ను క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

♦ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం ల‌భించ‌దు.

♦ ఎన్ఎస్‌సీ పెట్టుబ‌డుల‌పై రుణం తీసుకునే వీలుంది.

♦ 5ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వ‌చ్చిన వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. దీన్ని మొత్తాన్ని ఖాతాదారుడి ఆదాయానికి క‌లిపి ఏ ప‌న్ను శ్లాబు వ‌ర్తిస్తుందో దాన్ని బ‌ట్టి ప‌న్ను విధిస్తారు. దీంతో పాటు టీడీఎస్ కూడా వ‌ర్తిస్తుంది.

♦ ఎన్ఎస్‌సీలో ల‌భించిన వ‌డ్డీపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే 5 వ సంవ‌త్స‌రం లేదా చివ‌రి సంవ‌త్స‌రంలో వ‌చ్చిన వ‌డ్డీని తిరిగి పెట్టుబ‌డులకు వెళ్ల‌దు. దీనిపై ప‌న్ను త‌గ్గింపునకు అవ‌కాశం లేదు. ఈ వ‌డ్డీ పెట్టుబ‌డిదారుడి ఆదాయానికి క‌లిపి మొత్తంపై ప‌న్ను వ‌సూలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని