సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఇస్తే..

దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌లో కోత విధిస్తున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీ రేటు ప‌డిపోతున్న ఈ త‌రుణంలో పెద్ద‌ల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) మంచి ప‌థ‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఐదు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉన్న ఈ ప‌థ‌కం ప్ర‌స్తుతం వార్షికంగా 8.6 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. ఈ ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజ‌న్లు..

Published : 18 Dec 2020 15:52 IST

దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌లో కోత విధిస్తున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీ రేటు ప‌డిపోతున్న ఈ త‌రుణంలో పెద్ద‌ల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) మంచి ప‌థ‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఐదు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉన్న ఈ ప‌థ‌కం ప్ర‌స్తుతం వార్షికంగా 8.6 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. ఈ ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజ‌న్లు గ‌రిష్టంగా రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు జమ చేసుకోవ‌చ్చు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి వ‌డ్డీ చెల్లిస్తారు. అయితే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ప్ర‌భుత్వం ఈ స్కీమ్‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌వ‌చ్చు కానీ, దీంతో ద్ర‌వ్యోలోటుపై 2 బేసిస్ పాయింట్ల మేర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఎస్‌బీఐ ప‌రిశోధ‌న నివేదిక తెలిపింది ఇదే ఈ ప‌థ‌కానికి ఉన్న పెద్ద లోపం అని, సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కంపై ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌టించ‌వ‌చ్చు. అయితే దీని కార‌ణంగా 2 బేసిస్ పాయింట్ల మేర ఆర్థిక లోటుపై ప్ర‌భావం ఉంటుంద‌ని ఎస్‌బీఐ ప‌రిశోధ‌న బృందం త‌న నివేదిక‌లో తెలిపింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇది మంచి ప‌థ‌కం అయిన‌ప్ప‌టికీ వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తించ‌డం లోపంగా తెలిపింది.

ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ కింద మార్చి,2018 వ‌ర‌కు రూ. 38,662 కోట్లు జ‌మ‌య్యాయి. ఈ ప‌థ‌కం కింద పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌టిస్తే, ప్ర‌భుత్వానికి రూ. 3092 కోట్ల భారం ప‌డుతుంది. ఇది ప్ర‌భుత్వం ఆర్థిక లోటుపై 2 బేసిస్ పాయింట్ల‌ మేర ప్ర‌భావం చూపుతుందని పేర్కొంది. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం వార్షికంగా రూ. 10 వేల కంటే ఎక్కువ‌గా ఉంటే మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) డిడ‌క్ట్ చేస్తారు. ఈ ప‌థ‌కంలో పెట్టే పెట్టుబ‌డుల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. సెక్ష‌న్ 80టీటీబీ కింద సినియ‌ర్ సిటిజ‌న్లు వ‌డ్డీ ఆదాయంపై రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని