Huawei: దిల్లీ, బెంగళూరుల్లోని హువావే కార్యాలయాలపై ఐటీ దాడులు

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ కంపెనీ హువావే కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రాం,బెంగళూరుల్లోని కార్యాలయాల్లో ఈమేరకు సోదాలు జరిగాయి.

Published : 16 Feb 2022 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ కంపెనీ హువావే కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రాం, బెంగళూరుల్లోని కార్యాలయాల్లో ఈమేరకు సోదాలు జరిగాయి. కీలక సమాచారం లభించడంతో ఐటీశాఖ ఈ దాడులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై హువావే ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐటీ శాఖ అధికారులు మా కార్యాలయాన్ని సందర్శించారు. కొందరు అధికారులతో భేటీ అయ్యారు. భారత్‌లోని అన్ని రకాల చట్టాలను పాటిస్తున్నామని హువావే నమ్మకంగా చెబుతోంది. మేం మరింత సమాచారంతో ఆయా విభాగాలను కలుస్తాం. వారికి  పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

గత డిసెంబర్‌లో చైనా ఫోన్లు తయారు చేసే పలు యూనిట్లపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేతపై అనుమానాలు ఉండటంతో ఒప్పొ, షావోమికి సంబంధించిన సంస్థలపై దాడులు చేసింది.  వీటి తయారీ యూనిట్లలో పలు లోపాలను గుర్తించినట్లు ఆ శాఖ ప్రకటించింది. స్వదేశానికి రాయల్టీ రూపంలో ఈ కంపెనీలు ఏకంగా రూ.5,500 కోట్లు పంపించినట్లు పేర్కొంది. వీరు చెబుతున్నంత ఖర్చులు కనిపంచలేదని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని