ఐటీఆర్ ఫైల్ చేసాక రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

ఒకవేళ మీరు కట్టిన పన్ను/ టీడీఎస్ కట్టవలసిన పన్ను కంటే ఎక్కువ ఉంటే మీరు రిఫండ్ కి అర్హులు. ఈ విషయం మీకు తెలిసి ఉండుంటుంది. ఆదాయ పన్ను రిటర్న్ వెరిఫికేషన్ పూర్తయ్యాక రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది.

Updated : 01 Jan 2021 16:57 IST

మీరు సులువుగా రిఫండ్ స్టేటస్ తెలుసుకోగలరు. దీని కోసం ఈ విధింగా చేయండి. ఇప్పటికే కొంత మంది ఐటీఆర్ దాఖలు చేసి ఉండుంటారు. ఒకవేళ మీరు కట్టిన పన్ను/ టీడీఎస్ కట్టవలసిన పన్ను కంటే ఎక్కువ ఉంటే మీరు రిఫండ్ కి అర్హులు. ఈ విషయం మీకు తెలిసి ఉండుంటుంది. ఆదాయ పన్ను రిటర్న్ వెరిఫికేషన్ పూర్తయ్యాక రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. రిఫండ్ నేరుగా మీరు తెలిపిన బ్యాంకు ఖాతా లో జమ అవుతుంది. అయితే, దీని కోసం మీ బ్యాంకు ఖాతా ని పాన్ కార్డుకి లింక్ చేయడం తప్పనిసరి. గతం లో లాగా ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు చెక్కులు జారీ చేయడం ఆపేసింది.

మీరు రిఫండ్ కోసం వేచి ఉన్నట్టయితే ఈ కథనం మీ కోసమే. మీరు సులువుగా రిఫండ్ స్టేటస్ తెలుసుకోగలరు. దీని కోసం ఈ కింది విధింగా చేయండి.

► ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్సైటు లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
‘వ్యూ రిటర్న్స్ అండ్ ఫార్మ్స్’ పైన క్లిక్ చేయండి.
► ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
► మీ రిటర్న్ కి సంబంధించిన ఆర్ధిక సంవరసాన్ని సెలెక్ట్ చేసుకోండి.
► మీ రిఫండ్ మీ బ్యాంకు ఖాతా లోకి జమ చేసినట్టయితే ‘రిఫండ్ పైడ్’ అని చూపిస్తుంది. ఇలా చూపించక కూడా మీ బ్యాంకు లో డబ్బు జమ అవ్వకపోతే మీ బ్యాంకు ని లేదా రిఫండ్ క్లెయిమ్ ప్రాసెస్ చేసే ఎస్బీఐ ని సంప్రదించవచ్చు. ఆదాయ పన్ను శాఖ వారిని కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నట్టయితే స్టేటస్ ‘ఈ-వెరిఫీడ్’ అని మాత్రమే చూపిస్తుంది.

రిఫండ్ స్టేటస్ తెలుసుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html లింక్ క్లిక్ చేసి, మీ పాన్ నెంబర్ తెలియజేయండి, ఆర్ధిక సంవత్సరం ఎంచుకోండి.

ఆర్ధిక మంత్రి రిఫండ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా రిఫండ్ బ్యాంకులో జమ అయ్యే లాగా చర్యలు తీసుకోనున్నట్టు కూడా తెలియజేసారు.

(Source:Livemint)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని