IT Returns: ఈ ఏడాది 5.83కోట్ల ఐటీ రిటర్నులు

గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి మొత్తం 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలయ్యాయి........

Published : 01 Aug 2022 20:38 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి మొత్తం 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలయ్యాయి. జులై 31వ తేదీతో ఐటీ రిటర్నుల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ‘జులై 31వ తేదీ నాటికి మాకు దాదాపు 5.83 కోట్ల రిటర్న్‌లు అందాయి’ అని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. చివరి రోజైన ఆదివారం ఐటీ రిటర్నులు పోటెత్తాయి. శనివారం నాటికి దాదాపు 5.10 కోట్లు  దాఖలు కాగా.. ఆదివారం ఒక్కరోజులోనే దాదాపు 72 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. చివరి గంట సమయంలో (రాత్రి 11 నుంచి 12గంటల వరకు) 5 లక్షల రిటర్నులు దాఖలు కావడం విశేషం.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2021 డిసెంబరు 31 వరకు పొడిగించిన సంగతి తెలసిందే. ఆ ఏడాది 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రిటర్నులు కాస్త తక్కువగానే దాఖలు కావడం గమనార్హం. గడువు ముగిసినప్పటికీ డిసెంబరు 31 వరకు అపరాధ రుసుముతో దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000, అంతకుమించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి, ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని