Credit card: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా?
కార్డు తీసుకున్న వ్యక్తి చెల్లింపుల ప్రవర్తన, ఆదాయ వృద్ధి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని, కార్డు జారీ సంస్థలు క్రెడిట్ లిమిట్‌ను పెంచుతుంటాయి
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు (Credit card) వాడుతున్నారా? కార్డు పరిమితిని (Card Limit) పెంచుతామని కార్డు జారీ సంస్థ నుంచి కాల్స్ వస్తున్నాయా? ఈ ఆఫర్ అంగీకరించాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి బ్యాంకులు తక్కువ క్రెడిట్ పరిమితితో కార్డును మంజూరు చేస్తాయి. కార్డు తీసుకున్న వ్యక్తి చెల్లింపుల ప్రవర్తన, ఆదాయ వృద్ధి వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్‌ను పెంచుతుంటాయి. క్రెడిట్ లిమిట్‌ను పెంచేందుకు కార్డు జారీ సంస్థలు ముందుకొచ్చినా అధికంగా ఖర్చు చేస్తామనో.. అప్పుల ఉచ్చులో చిక్కుకుంటామన్న భయంతోనో చాలా మంది ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుంటారు. మరి క్రెడిట్ కార్డు పరిమితి పెంపు విషయంలో వినియోగదారుని భయాలు నిజమేనా? లిమిట్ పెంచడం వల్ల లాభమా? నష్టమా?
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలు..
క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు: క్రెడిట్ స్కోరు (Credit Score) లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరో సంస్థలు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాల్లో రుణ వినియోగ నిష్పత్తి (క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో..CUR) కూడా ఒకటి. క్రెడిట్ కార్డుదారునికి అనుమితించిన పరిమితిలో ఎంత మొత్తం వినియోగించారో సీయూఆర్ తెలియజేస్తుంది. సీయూఆర్ 30 శాతం స్థాయిని మించిందంటే మీ ఖర్చులు పరిమితిని మించుతున్నాయని అర్థం. తరచూ ఇదే విధంగా జరుగుతుంటే.. రుణ ఎగవేతలకు అవకాశం పెరుగుతుందని భావించి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరు తగ్గిస్తాయి.
క్రెడిట్ స్కోరు మెరుగుపర్చుకునేందుకు సీయూఆర్ 30 శాతంలోపు ఉండడం అవసరం. ఒకవేళ మీ రుణ వినియోగ నిష్పత్తి తరచూ 30 శాతం దాటుతుంటే మీరు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవడం మంచిది. ఇప్పటికే మీ కార్డు జారీ సంస్థ మీకు క్రెడిట్ కార్డు పరిమితి పెంపు ఆఫర్‌ను ఇచ్చినట్లయితే.. దాన్ని అంగీకరించడం మంచిది. లేదా కొత్త క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ లక్ష రూపాయలనుకుందాం. మీరు ప్రతి నెలా క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.45 వేలు ఖర్చుచేస్తుంటే.. అప్పుడు మీ సీయూఆర్ 45 శాతం అవుతుంది. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1.50 లక్షలకు పెంచితే సీయూఆర్ 30 శాతానికి తగ్గుతుంది. అదనపు లిమిట్ రూ. 50 వేలు అందుబాటులోకి రావడం వల్ల సీయూఆర్ 30 శాతంగా ఉంటుంది. ఇది మీ క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావం చూపించదు.
ఆర్థిక ఇబ్బందుల్లో..: క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోవడం వల్ల అదనపు మొత్తం మీకు అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి వాటి కారణంగా తలెత్తే అర్థిక అవసరాలకు సహాయపడుతుంది. నిధుల కొరత, లిక్విడిటీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
అధిక రుణం పొందొచ్చు: క్రెడిట్ కార్డు పరిమితి ఎక్కువగా ఉంటే క్రెడిట్ కార్డుపై అధిక రుణం పొందొచ్చు. కార్డు జారీ సంస్థలు ఈ రుణాలను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందిస్తాయి. ఖర్చులు, చెల్లింపుల చరిత్ర సక్రమంగా ఉన్న వారికి మాత్రమే ఈ రకమైన రుణాలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న రోజునే బ్యాంకులు ఈ రుణాలను వినియోగదారులకు అందిస్తాయి. కాబట్టి, పరిమితి పెంపు వల్ల అత్యవసరాల్లో అధిక మొత్తంలో రుణం పొందేందుకు వీలుంటుంది.
నష్టాలు..
రుణ భారం పెరగొచ్చు: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల వినియోగానికి ఎక్కువ మొత్తం అందుబాటులో ఉంటుంది. అవసరానికి మించి ఖర్చులు చేస్తే.. చెల్లింపులు కష్టమవుతాయి. దీంతో చాలా మంది కనీస మొత్తం చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు వాయిదా వేస్తుంటారు. దీంతో వడ్డీ, ఫైనాన్స్ ఛార్జీలతో చెల్లించాల్సిన రుణం భారం అవుతుంది.
క్రెడిట్ స్కోరు తగ్గొచ్చు: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. లిమిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఖర్చులు అధికమై బిల్లు సకాలంలో చెల్లించపోతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
అధిక వడ్డీ: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాంకులు వడ్డీ రహిత కాలవ్యవధిని అందిస్తాయి. ప్రతి నెలా సమయానికి వినియోగించిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే.. మరుసటి రోజు నుంచి వడ్డీ వర్తిస్తుంది. వార్షిక వడ్డీ 36 శాతం నుంచి 48 శాతం వరకు సంస్థను బట్టి ఉంటుంది. కొత్త కొనుగోళ్లకు వడ్డీ రహిత వ్యవధి ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే: ఒకవేళ మీరు క్రెడిట్‌కార్డు పోగొట్టుకున్నా, ఎవరైనా సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కినా నష్టపోయే మొత్తం కూడా పెరుగుతుంది.
చివరిగా: క్రెడిట్ కార్డును బాధ్యతగా వాడుకున్నంత కాలం లిమిట్ పెంచుకోవడం వల్ల లాభమే గానీ నష్టం ఉండదు. ఖర్చులపై నియంత్రణ లేనివారు, క్రెడిట్ కార్డు వినియోగంపై అవగాహన లేని వారు మాత్రం లిమిట్‌ను పెంచుకోకపోవడమే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు. -
కారు రుణంపై టాపప్
మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి. -
Emergency Loan: అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి?
చాలా మందికి అత్యవసరంగా నగదు అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు మెరుగైన క్రెడిట్ స్కోరున్నా, కొన్ని కేటగిరీల ఆస్తులున్నా సరే వేగంగా రుణం పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డు కనీస మొత్తం చెల్లిస్తుంటే
క్రెడిట్ కార్డు బిల్లును మొత్తం ఒకేసారి చెల్లించాలి. కొన్నిసార్లు చేతిలో డబ్బు లేకపోతే.. కనీస మొత్తం మనల్ని ఆకర్షిస్తుంటుంది. -
HDFC bank: రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
HDFC bank latest Interest rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. వివిధ కాలవ్యవధులకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ను పెంచింది. -
FD rates: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు ఎంపిక చేసిన కాలవ్యవధి ఎఫ్డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. -
Fixed Deposits: కార్పొరేట్ సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే..
'AAA' రేటింగ్ ఉన్న కార్పొరేట్ సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. -
క్రెడిట్ కార్డు.. ఇలా వాడుదాం
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. క్రెడిట్ కార్డుల వినియోగదారులను ఆకర్షించేది ఇదే. వెసులుబాటు ఉంది కదా అని అవసరానికి మించి వాడితే అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది. -
Home Loans: గృహ రుణాలపై లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..!
బ్యాంకులు ఇతర రుణాలకంటే కూడా ఇంటి రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. వివిధ బ్యాంకులు వసూలుజేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
-
నాడు హిట్లర్‌ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్