MCLR: రుణ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంకులు

ఐసీఐసీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు తమ రుణ వడ్డీ రేట్ల(MCLR)ను పెంచాయి

Published : 01 Dec 2022 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) రుణ రేట్లను పెంచాయి. ఈ రేట్లు 2022 డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. MCLR పెంపుతో అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్‌ అన్ని కాలవ్యవధులకు MCLRను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ బ్యాంకు MCLR(ఒక ఏడాది) రేటు 8.30% నుంచి 8.40 శాతానికి పెరిగింది.
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 5 బేసిస్‌ పాయింట్లను పెంచింది. ఈ బ్యాంకు MCLR (ఒక ఏడాది) ఇప్పుడు 8.05% నుంచి 8.10%కు పెరిగింది.
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ బ్యాంకు MCLR (ఒక ఏడాది) ఇప్పుడు 8.15%కు పెరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని