5G speed: 5జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 500 Mbps.. జియోదే పైచేయి!

దేశీయ టెలికాం కంపెనీలు అందిస్తున్న 5జీ డేటా వేగం తాలూకా లెక్కల్ని ఊక్లా తాజాగా విడుదల చేసింది.

Published : 11 Oct 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ సేవలు అక్టోబర్‌ 1న ప్రారంభమయ్యాయి. ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే కొన్ని నగరాల్లో సేవలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు అందిస్తున్న 5జీ డేటా వేగం  లెక్కల్ని ఇంటర్నెట్‌ టెస్టింగ్‌ కంపెనీ ఊక్లా తాజాగా విడుదల చేసింది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్‌ వేగం 500 Mbpsగా ఉందని పేర్కొంది. టెలికాం కంపెనీ వారీగా చూస్తే.. దిల్లీలో జియో డౌన్‌లోడ్‌ సగటు వేగం 598.58 Mbps ఉందని, అదే సమయంలో ఎయిర్‌టెల్‌ వేగం 197.98 Mbpsగా ఉందని ఊక్లా పేర్కొంది. 

దిల్లీ, కోల్‌కతా, ముంబయి, వారణాశి నగరాలకు సంబంధించిన డేటాను ఊక్లా వెల్లడించింది. జూన్‌ నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ముంబయిలో 5జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విషయంలో జియో అగ్రస్థానంలో ఉంది. ఆ కంపెనీ సగటు డౌన్‌లోడ్‌ వేగం 515.38 Mbpsగా ఉందని ఊక్లా తెలిపింది. ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ వేగం 271.07 Mbpsగా ఉందని పేర్కొంది. కోల్‌కతాలో సైతం జియో 482.02 Mbps సగటు వేగాన్ని నమోదు చేయగా.. ఎయిర్‌టెల్ సగటు వేగం మాత్రం 33.83 Mbpsగా ఉంది. వారణాశిలో మాత్రం ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఎయిర్‌టెల్‌ 516.57 Mbps సగటు వేగాన్ని నమోదు చేయగా.. జియో 485.22 Mbp వేగాన్ని అందుకుందని ఊక్లా తెలిపింది. కంపెనీలు ఇంకా తమ నెట్‌వర్క్‌ను ఫైన్‌ ట్యూన్‌ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కమర్షియల్‌ సేవలు ప్రారంభం అయ్యాక డేటా వేగంలో స్థిరత్వం వస్తుందని పేర్కొంది. కాగా.. ఆగస్టులో భారత్‌లో సగటు మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 13.52 Mbpsగా ఉందని, ఈ విషయంలో ప్రపంచంలో 117వ స్థానంలో భారత్‌ నిలిచిందని ఊక్లా తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని