FTA: 9 ఏళ్ల తర్వాత ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యంపై భారత్‌ చర్చలు

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌, ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి....

Updated : 18 Jun 2022 14:11 IST

దిల్లీ: దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌, ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, యురోపియన్‌ కమిషన్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వాల్దిస్‌ డోంబ్రోవ్‌స్కిస్‌ భేటీ అయ్యారు. స్టాండలోన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ అగ్రిమెంట్‌, జియోగ్రాఫికల్‌ ఇండికేటర్స్‌ అగ్రిమెంట్‌పైనా చర్చలను ప్రారంభించారు. ఇరుపక్షాల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 2013లో ఎఫ్‌టీఏపై చర్చలు నిలిచిపోయాయి. ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించారు. మరోవైపు భారత ప్రధాని మోదీ సైతం ఇటీవల ఐరోపాలో పర్యటించారు. దీంతో చర్చల ప్రక్రియ ఊపందుకుంది. అమెరికా తర్వాత భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఈయూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్చలను పునఃప్రారంభించారు. భారత్‌ ఇటీవల ఆస్ట్రేలియా, యూఏఈతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని