Digital Payments: డిజిటల్‌ పేమెంట్స్‌లో భారత్‌.. నం 1!

డిజిటల్‌ పేమెంట్స్‌ (digital payments)లో భారత్‌ (India) సరికొత్త మైలురాయిని చేరుకుంది. అత్యధిక డిజిటల్‌ చెల్లింపు చేస్తోన్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రకటించింది. 

Updated : 10 Jun 2023 18:33 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌ (digital Payments)లో భారత్‌ (India) అగ్రస్థానంలో ఉందని, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ (cashless economy) వైపు దూసుకెళ్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో తొలి ఐదు దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

డిజిటల్‌ లావాదేవీల్లో బ్రెజిల్‌ 29.2 బిలియన్లతో రెండోస్థానంలో నిలవగా.. చైనా (17.6 బిలియన్ల), థాయ్‌లాండ్‌ (16.5 బిలియన్ల), దక్షిణకొరియా (8 బిలియన్ల) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్లోబల్‌ రియల్‌టైమ్‌ పేమెంట్స్‌లో భారత్‌ వాటా 46 శాతంగా ఉంది. ఇది టాప్‌ 5లో ఉన్న మిగతా నాలుగు దేశాల వాటాలను కలిపినా ఎక్కువగానే ఉంటుందని కేంద్రం తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. డిజిటల్‌ లావాదేవీల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభించే దేశాల్లో భారత్‌ ఒకటని.. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా డిజిటల్‌గా మారుతోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని