వాటి వినియోగం తగ్గిస్తే 40 శాతం కాలుష్యం మాయం: గడ్కరీ

పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వల్లే కాలుష్యం పెరుగుతోందని నితిన్‌ గడ్కరీ అన్నారు. కాబట్టి వాటి వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Published : 05 Jun 2023 15:27 IST

దిల్లీ: దేశంలో కాలుష్యానికి పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాలే కారణమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Gadkari) అన్నారు. వీటి వాడకాన్ని తగ్గిస్తే 40 శాతం కాలుష్యం తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ఏటా రూ.16 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దేశం దిగుమతి చేసుకుంటోందన్నారు. ఇవి కాలుష్య కారకాలు మాత్రమే కాకుండా దేశ ఆర్థికానికి అతిపెద్ద సవాల్‌ అని గడ్కరీ పేర్కొన్నారు. వీటికి తోడు ఏటా రూ.12 లక్షల కోట్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వీటి వాడకాన్ని తగ్గించాల్సి ఉందన్నారు.

క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ వినియోగానికి సంబంధించి టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీల పాత్ర కీలకమన్నారు. కాలుష్య కారకాలైన శిలాజ ఇంధనాల వినియోగదాన్ని తగ్గించేందుకు గానూ సాంకేతికను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాటిపై ఉందని చెప్పారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పదాక ఇంధన ఉత్పత్తిని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం మొత్తం విద్యుత్‌ వినియోగంలో సోలార్‌ ఎనర్జీ వాటా 38 శాతంగా ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని