
WEF: పర్యాటకాభివృద్ధి సూచీలో దిగజారిన భారత్ స్థానం.. జపాన్ నంబర్ వన్
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ- 2021’లో భారత్ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఎనిమిది స్థానాలు దిగజారడం గమనార్హం. అయితే.. ఇప్పటికీ దక్షిణాసియాలో మొదటి స్థానంలో ఉంది. జపాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా.. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల ఆర్థిక వ్యవస్థలు, అక్కడి ప్రయాణ, పర్యాటక రంగాల్లో వృద్ధి, భద్రత, ఆరోగ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, పర్యావరణం తదితర అంశాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను రూపొందించింది. రెండేళ్లకోసారి రూపొందించే ఈ అధ్యయనాన్ని 2019 వరకు ‘ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచీ’ పేరిట విడుదల చేసింది.
ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి ప్రయాణ, పర్యాటక రంగాలు అందించే సహకారం విలువను కొవిడ్ లాక్డౌన్లు చాటిచెప్పాయని డబ్ల్యూఈఎఫ్ ట్రావెల్, టూరిజం హెడ్ లారెన్ ఉప్పింక్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మహమ్మారి నుంచి బయటపడిన నేపథ్యంలో.. దశాబ్దాలపాటు నాణ్యమైన ప్రయాణ, పర్యాటక సేవలు అందించేందుకు వీలుగా బలమైన వాతావరణాన్ని నిర్మించడంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ పర్యాటక సంస్థ వివరాల ప్రకారం కరోనా తర్వాత ఈ రంగంలో పునరుద్ధరణ అసమానంగా ఉంది. జనవరి 2022లో పర్యాటకుల రాక 2019 జనవరితో పోల్చితే 67 శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ.. టీకాల భ్యం, ప్రయాణాలపై ఆసక్తి, దేశీయ, ప్రకృతి పర్యాటకానికి పెరుగుతోన్న డిమాండ్ కారణంగా ఈ రంగం క్రమంగా పుంజుకుంటోందని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
BSNL Broadband Plan: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా? ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
Politics News
Eknath Shinde: శిందే వర్గం పార్టీ పెట్టనుందా..? పేరు అదేనా..?
-
General News
Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
-
Business News
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఒక్క కాల్‌తో వివిధ బ్యాంకింగ్ సేవలు!
-
Sports News
Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!