Indian Economy: ‘ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందేది భారత ఆర్థిక వ్యవస్థే’

బడ్జెట్‌ 2022-23లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది.....

Published : 16 Feb 2022 20:36 IST

కేంద్ర ఆర్థికశాఖ నెలవారీ నివేదిక

 దిల్లీ: బడ్జెట్‌ 2022-23లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందుకున్న తయారీ, నిర్మాణ రంగాలు అందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

వ్యవసాయ రంగానికి వస్తే సాగు విస్తీర్ణంలో పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. బహుళ పంటల సాగు సైతం పుంజుకుందని పేర్కొంది. అలాగే భారీ ఎత్తున కొనుగోలు, పీఎం కిసాన్‌ సహా కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ చర్యల వల్ల రైతులు సైతం లాభపడనున్నారని నివేదిక అభిప్రాయపడింది. 2022కి గానూ ఒక్క భారత్‌ తప్ప ప్రపంచ దేశాల వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించిందని గుర్తుచేసింది. గత బడ్జెట్‌ల ద్వారా నిర్దేశించిన మార్గాలను తాజా బడ్జెట్‌ మరింత బలపరచనుందని తెలిపింది.

కొవిడ్‌ మూడో దశలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడగలిగిందని నివేదిక తెలిపింది. విద్యుత్తు వినియోగం, తయారీ కార్యకలాపాలు, ఎగుమతులు, ఈ-వే బిల్లుల జనరేషన్‌ వంటి అంశాల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. కొవిడ్‌-19 వల్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయని.. డిమాండ్‌ పుంజుకుంటుందని వెల్లడించింది. తద్వారా ప్రైవేటు పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి గాడిలో పడుతుందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని