అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు 

దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం

Updated : 30 Apr 2021 15:38 IST

దిల్లీ: దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని మే 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదన్నారు. అలాగే,  డీజీసీఏ ఇప్పటికే ఎంపిక చేసిన మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని