India GDP: 2022-23లో భారత జీడీపీ వృద్ధి 7.2 శాతం

India GDP: 2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇది 9.1 శాతంగా ఉంది.

Published : 31 May 2023 23:33 IST

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) గణాంకాలు వెల్లడయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్‌, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) జీడీపీ గణాంకాలను బుధవారం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.1 శాతం కాగా.. 2022-23లో 7.2 శాతంగా నమోదైంది. 

త్రైమాసికాల వారీగా చూస్తే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 13.1 శాతం, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.2 శాతం, అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో 4.5 శాతం, జనవరి- మార్చి త్రైమాసికంలో ఇది 6.1 శాతంగా ఉంది. ఇదే సమయంలో పొరుగు దేశం చైనా 2023 తొలి మూడు నెలల్లో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఎన్‌ఎస్‌వో వెలువరించిన రెండో సవరించిన అంచనాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 7 శాతం వృద్ధి నమోదు అవుతుందని లెక్కించింది. అంచనాలను మించి వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు