Indian corporates: 501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు

ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Published : 07 Jul 2024 02:01 IST

కార్పొరేట్ల రికార్డు లావాదేవీలు
రెండో త్రైమాసికంపై గ్రాంట్‌ థార్న్‌టన్‌ నివేదిక

దిల్లీ: ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి విలువ 21.4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.77 లక్షల కోట్లు)గా ఉందని గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ డీల్‌ట్రాకర్‌ పేర్కొంది. ఈ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం..

  • రెండేళ్లలోనే అత్యధిక త్రైమాసికం వారీ లావాదేవీలు ఈ  ఏప్రిల్‌-జూన్‌లో నమోదయ్యాయి. భారీ విలీన-కొనుగోలు (ఎం అండ్‌ ఏ) లావాదేవీలు లేకపోవడంతో విలువ మాత్రం తగ్గింది.
  • ఎం అండ్‌ ఏ, పీఈ ఒప్పందాలు మొత్తం 467 నమోదయ్యాయి. వీటి విలువ 14.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఒప్పందాల సంఖ్య 9 శాతం మేర పెరిగింది. కానీ విలువ పరంగా 28 శాతం తగ్గింది. తొలి త్రైమాసికంలో రిలయన్స్‌-డిస్నీ మెగా విలీనం(8.5 బి. డాలర్లు) చోటు చేసుకోవడం ఇందుకు కారణం.
  • జూన్‌ త్రైమాసికంలో బిలియన్‌ డాలర్ల ఒప్పందం ఒకటే కనిపించింది. అయితే అధిక విలువ గల ఒప్పందాలు (100 మి.డాలర్లకు పైగా) మాత్రం 30 నమోదయ్యాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇవి 58 శాతం అధికం. 
  • భారత కార్పొరేట్లు దేశీయంగా ఎక్కువ పెట్టుబడులు పెడుతుండడం.. స్థానిక పెట్టుబడుల వాతావరణంపై వారికున్న విశ్వాసాన్ని సూచిస్తోంది.
  • అంతర్జాతీయ అనిశ్చితులు, అస్థిరత కారణంగా బయటి దేశాలతో ఒప్పందాలు తగ్గినా.. ఫార్మా, తయారీ వంటి సంప్రదాయ రంగాల్లో ఒప్పందాలు పెరిగాయి. మొత్తం విలువలో వీటి వాటానే సగం కావడం విశేషం. 
  • రాబోయే ఆరు నెలల్లో ఒప్పందాలు పెరగవచ్చు. ఎన్నికల ఫలితాల వెలువడడంతో విధాన స్పష్టతపై అంచనా, త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ రానుండడం, రాజకీయ స్థిరత్వం కనిపిస్తుండడం.. తదితరాలు పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని పెంచవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని