FDI Inflow: ఈ ఆర్థిక సంవత్సరంలో 100 బి.డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు: కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) దేశానికి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Published : 24 Sep 2022 19:56 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) దేశానికి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సరళతర వాణిజ్య విధానాలు ఇందుకు దోహదపడబోతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2021-22 ) ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా 83.6 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు దేశానికి వచ్చాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

గతేడాది 101 దేశాల నుంచి 31 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 రంగాల్లో ఈ పెట్టుబడులు వచ్చాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు రాబోతున్నాయని పేర్కొంది.  కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఇందుకు కారణమని తెలిపింది. చాలా రంగాల్లో ఆటోమేటిక్‌ రూట్‌లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ఇందుకు కారణమని పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 6 శాతం మేర తగ్గి  16.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని