Nestle Maggi: మ్యాగీ వినియోగం మన దగ్గరే ఎక్కువ.. నెస్లేకు అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌

Nestle Maggi: ప్రపంచ దేశాలన్నింటిలో కంటే మ్యాగీ వాడకం మన దేశంలోనే ఎక్కువని నెస్లే ఇండియా తన వార్షిక నివేదికలో పేర్కొంది.

Updated : 18 Jun 2024 17:53 IST

Nestle Maggi | దిల్లీ: మ్యాగీ నూడుల్స్‌ పేరిట ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను విక్రయిస్తున్న నెస్లే సంస్థకు (Nestle) అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటి. నూడుల్స్‌, చిన్న పిల్లల ఆహార ఉత్పత్తులతో పాటు వివిధ రకాల ప్రొడక్ట్‌లను దేశీయంగా విక్రయిస్తోంది. అయితే, మ్యాగీ నూడుల్స్‌ విషయంలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశమే అతిపెద్ద మార్కెట్‌ అని ఆ కంపెనీ వెల్లడించింది. నెస్లే తయారు చేసే కిట్‌క్యాట్‌ విక్రయాల విషయంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని తెలిపింది. ఈ మేరకు నెస్లే ఇండియా వార్షిక నివేదిక వెలువరించింది. 

దేశంలో మ్యాగీ బ్రాండ్‌పై నెస్లే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను చాలా ఏళ్లుగా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. రెండు నిమిషాల్లో తయారీ పేరిట ఈ నూడుల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలోనే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అధికంగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెస్లే సంస్థ ఏకంగా 600 కోట్లకు పైగా సర్వింగ్స్‌ (ఒక్కో సర్వ్‌ 70 గ్రాములు) గల మ్యాగీని విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మరోవైపు కిట్‌క్యాట్‌ కూడా మెరుగైన వృద్ధిని నమోదు చేయడంతో నెస్లేకు రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారిందని పేర్కొంది. దేశంలో మొత్తం 4200 మిలియన్‌ కిట్‌క్యాట్‌ ఫింగర్స్‌ (కిట్‌క్యాట్‌లో ఉండే బార్స్‌)ను విక్రయించినట్లు నెస్లే తెలిపింది. 

భారత్‌కు గూగుల్‌ జెమిని యాప్‌.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!

మ్యాగీ విషయానికొస్తే.. పరిమితికి మించి కొన్ని రకాల పదార్థాలను అధికంగా వినియోగించారన్న ఆరోపణలపై మ్యాగీ 5 నెలల పాటు నిషేధం ఎదుర్కొంది. 2015లో మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆంక్షలకు ముందు 70 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉన్న మ్యాగీ.. పోటీ కారణంగా ఇప్పటికీ ఆ స్థాయిని అందుకోలేకపోవడం గమనార్హం. ఈ విభాగంలోకి కొత్త కొత్త సంస్థలు ప్రవేశించడమే దీనికి కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని