EV charging stations: ‘2030 నాటికి భారత్‌లో 46 వేల ఛార్జింగ్ స్టేషన్లు అవసరం’
అల్వరెజ్ అండ్ మార్షల్ నివేదిక
దిల్లీ: విద్యుత్తు వాహన రంగంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే దేశంలో 2030 నాటికి 46,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని అల్వరెజ్ అండ్ మార్షల్ అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. చైనాలో ప్రతి 6 విద్యుత్తు వాహనాల (EV)కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటే భారత్‌లో ఆ సంఖ్య 135గా ఉందని వెల్లడించింది. అదే అమెరికాలో 19 వాహనాలకు ఒక స్టేషన్ ఉన్నట్లు తెలిపింది. ధర అందుబాటులో లేకపోవడం, మైలేజీ, సరఫరా ఇబ్బందులు, భద్రత-నాణ్యత, రుణసదుపాయం లేకపోవడం వంటివి భారత్‌లో ఈవీ రంగ పురోగతికి సవాళ్లుగా నిలుస్తున్నాయని నివేదిక వెల్లడించింది. వీటిని అధిగమించగలిగితే వచ్చే ఐదేళ్ల పాటు పరిశ్రమ 50-100 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. అతిపెద్ద వాహన పరిశ్రమ ఉన్న భారత్‌లో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీ రంగంలో నవకల్పనల్ని ప్రోత్సహించాల్సి ఉందని వివరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
-
Ts-top-news News
TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- మరో బాదుడు
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Jeevitha: నగరి కోర్టుకు హాజరైన సినీనటి జీవితారాజశేఖర్
- Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్‌గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్