IndiGo Chief: అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్ మార్కెట్ లో భారత్‌ ఒకటి : ఇండిగో చీఫ్‌

ప్రపంచంలోని అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్‌ మార్కెట్ (Indian aviation) లో భారత్‌ ఒకటని ఇండిగో (IndiGo) చీఫ్‌  పీటర్‌ ఎల్బర్స్‌ అన్నారు.

Published : 26 Sep 2023 16:15 IST

దిల్లీ : ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్‌ (aviation) మార్కెట్ లో భారత్‌ ఒకటిని ఇండిగో (IndiGo) సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ (Pieter Elbers) మంగళవారం అన్నారు.

దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌ (AIMA) సదస్సులో ఆయన మాట్లాడుతూ..‘పౌర విమానయాన (Indian aviation) రంగంలో భారత్‌ ఒక అద్భుతం, ప్రపంచంలోని విమానయాన మార్కెట్లలో ఎక్కువ పోటీ ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో 63 శాతం వాటా తో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ కార్యకలపాలను కూడా విస్తరిస్తోంది’ అని ఆయన అన్నారు.

ఇండిగో (IndiGo) కు ప్రస్తుతం 300 విమానాలున్నాయి. వీటితో దేశీయంగా 81, అంతర్జాతీయంగా 32 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. కరోనా సంక్షోభం తర్వాత భారత విమానయాన రంగం వేగంగా, బలంగా కోలుకుంటోందని పీటర్‌ అన్నారు. దేశ ఆర్థిక వృద్ధి ఇండిగోను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. అదే సమయంలో భారత వృద్ధికి ఇండిగో నెట్‌వర్క్‌ దన్నుగా నిలుస్తోందని పేర్కొన్నారు.

టాటాలకు చెందిన ఎయిరిండియా (Air Indiai) ఎయిర్‌బస్‌, బోయింగ్‌ నుంచి 470 విమానాల ఆర్డర్‌ దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్‌ కాగా.. ఇండిగో దాన్ని అధిగమించింది. 2030-2035 మధ్య డెలివరీ కోసం 500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌ పెట్టిన విషయం తెలిసిందే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు