Wheat Flour Exports: గోధుమ పిండి ఎగుమతులపై ఆంక్షలు

మే నెలలో గోధుమల ఎగుమతులపై విధించిన ఆంక్షల్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం దాని ఉత్పత్తులకూ విస్తరించింది...

Published : 07 Jul 2022 14:01 IST

దిల్లీ: మే నెలలో గోధుమల ఎగుమతులపై విధించిన ఆంక్షల్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం దాని ఉత్పత్తులకూ విస్తరించింది. గోధుమ పిండి, మైదా, రవ్వ సహా ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (DGFT) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 12 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో వచ్చిన ఇబ్బందుల నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగాయని డీజీఎఫ్‌టీ పేర్కొంది. ఫలితంగా నాణ్యతలోనూ సమస్యలు వస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని వివరించింది. గోధుమ పిండి ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధం లేదని.. ముందస్తు అనుమతి మేరకే ఎగుమతి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల జారీకి ముందే ఎగుమతులకు సిద్ధంగా ఉన్న గోధుమ ఉత్పత్తులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని