Updated : 03 Aug 2022 17:13 IST

windfall tax: విండ్‌ఫాల్‌ పన్ను తొలగింపు ఎప్పుడంటే..

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు (Crude Oil)పై విండ్‌ఫాల్‌ పన్ను (windfall tax)ను తిరిగి ఎప్పుడు ఉపసంహరించనున్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 40 డాలర్ల దిగువకు చేరినప్పుడే విండ్‌ఫాల్‌ పన్ను (windfall tax)ను తొలగిస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. అప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పన్నును సమీక్షిస్తామని పేర్కొన్నారు.

జులై 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్నుగా టన్నుకు రూ.23,250, విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోల్‌-విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై లీటరుకు 6, డీజిల్‌పై లీటరుకు రూ.13 చొప్పున ఎగుమతి సుంకం విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం కోత వల్ల కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎగుమతుల వల్ల కంపెనీలు పొందుతున్న అదనపు లాభాలకు చెక్‌ పెట్టడం కూడా ఇందులో భాగం. ఈ అదనపు పన్నుల వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీ, ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, వేదాంత వంటి కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడనుంది.

(ఇదీ చదవండి: ఖజానాకు నష్టం రూ.12,000 కోట్లే!

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 111.27 డాలర్లుగా కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, లిబియాలో అస్థిరత, చమురు ఉత్పత్తిలో ఒపెక్‌ కోత విధించడం వంటి కారణాలతో ఓ దశలో చమురు ధర 120 డాలర్లకు చేరింది. అయితే, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు అలుముకొంటున్నాయన్న సూచనలతో ధరలు దిగొచ్చాయి. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ బ్యారెల్‌ ధర 108.09 డాలర్ల వద్ద చలిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని