Akasa Air: జూన్‌లోనే ‘ఆకాశ ఎయిర్‌’ విమాన సేవలు

బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్‌’ తన మొదటి వాణిజ్య విమానాన్ని జూన్‌లో ప్రారంభించాలని యోచిస్తోంది.......

Published : 25 Mar 2022 22:46 IST

దిల్లీ: బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్‌’ సేవలను ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తన మొదటి వాణిజ్య విమానాన్ని జూన్‌లో ప్రారంభించాలని ‘ఆకాశ ఎయిర్‌’ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని లైసెన్సులు పొందే యత్నంలో ఉన్నట్లు సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ వినయ్ దూబే శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా ఎయిర్ షోలో దూబే మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. దేశీయంగా నడిచే ఈ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించిన 12 నెలల్లోనే 18 విమానాలను నడపాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో 72 విమానాలను నడపాలనుకుంటోంది.

భారతీయ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఈ ‘ఆకాశ ఎయిర్‌’ ఎయిర్‌లైన్స్‌ను ప్రాంరంభించనున్నారు. కాగా ఈ సంస్థకు గతంలోనే పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది. ‘ఆకాశ ఎయిర్‌’ బ్రాండ్‌ కింద ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఈ విషయాన్ని గత అక్టోబర్‌లోనే తెలిపింది. సేవలను ప్రారంభించడం కోసం అమెరికాకు చెందిన విమాన తయారీ కంపెనీ బోయింగ్‌కు 72 ‘737 మాక్స్‌’ విమానాలకు నవంబర్‌లో ఆర్డరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని