Indian domestic air travel: దేశీయ విమాన ప్రయాణికులు 1.37 కోట్లు

ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.37 కోట్లుగా నమోదైనట్లు డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. 2023 మేలో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ.

Published : 15 Jun 2024 02:46 IST

దిల్లీ: ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.37 కోట్లుగా నమోదైనట్లు డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. 2023 మేలో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ. ఈ ఏడాది జనవరి- మేలో 6.61 కోట్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణం చేశారు. గతేడాది ఇదే సమయంలో ప్రయాణించిన 6.36 కోట్లతో పోలిస్తే ఇది 3.99 శాతం అధికం.

సమయపాలన (ఆన్‌-టైమ్‌ పెర్ఫార్మెన్స్‌: ఓటీపీ)లో ఆకాశ ఎయిర్‌ 85.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. విస్తారా (81.9%), ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (74.9%), ఇండిగో (72.8%), ఎయిరిండియా (68.4%), స్పైస్‌జెట్‌ (60.7%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇండిగో మార్కెట్‌ వాటా మేలో 61.6 శాతానికి పెరిగింది. ఎయిరిండియా వాటా 13.7 శాతానికి తగ్గింది. విస్తారా, ఏఐఎక్స్‌ కనెక్ట్‌లు వరుసగా 9.2%, 5.4% వాటా దక్కించుకున్నాయి. ఆకాశ ఎయిర్‌ మార్కెట్‌ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి వృద్ధి చెందింది. స్పైస్‌జెట్‌ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని