Joyalukkas IPO: జోయాలుక్కాస్‌ ఐపీఓ లేనట్లే.. సెబీ నుంచి పత్రాల ఉపసంహరణ!

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో జోయలుక్కాస్‌ రూ.1,400 కోట్ల రుణభారాన్ని తగ్గించుకుంటామని తెలిపింది. తాజాగా ఐపీఓ నుంచి వెనక్కి తగ్గడంతో ఆ నిధులను కంపెనీ ఎలా సమకూర్చుకోనుందనే అంశం తెలియాల్సి ఉంది.

Published : 21 Feb 2023 17:04 IST

ముంబయి: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ (Joyalukkas) ఐపీఓ (IPO)పై వెనక్కి తగ్గింది. ఈ మేరకు పబ్లిక్ ఆఫర్‌ (IPO) అనుమతి కోసం సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాలను ఉపసంహరించుకుంది. కారణాలు మాత్రం వెల్లడించలేదు. రూ.2,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ గతంలో ఐపీఓ (IPO)కి దరఖాస్తు చేసుకుంది. 

ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1,400 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని ప్రాథమిక పత్రాల్లో జోయాలుక్కాస్‌ (Joyalukkas) తెలిపింది. మరి అందుకు కావాల్సిన నిధులను ఇప్పుడు ఎలా సమకూర్చుకోనున్నారో తెలియాల్సి ఉంది. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు దక్షిణాదిలో దాదాపు 68 పట్టణాల్లో విక్రయ కేంద్రాలున్నాయి.

రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐపీఓకు సెబీ అనుమతి..

ఐపీఓ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు దరఖాస్తు చేసుకున్న రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు సెబీ నుంచి అనుమతి లభించింది. ఈ ఐపీఓలో రూ.75 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 94.17 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించిన నిధులను నాశిక్‌లోని తయారీ కేంద్రం విస్తరణకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే కొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకుంటామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని